మనకున్న దారులు రెండే.. ముఖ్య నేతలు ముగ్గురే..  జన పయనం ఎటువైపు…?

0
1089
Janasena

మనకున్న దారులు రెండే.. ముఖ్య నేతలు ముగ్గురే..
జన పయనం ఎటువైపు…?

1. పవన్ కల్యాణ్…!!


మండు వేసవిలో పలకరించే వాన చినుకు.

ఆయన ఒక సమ్మోహనాస్త్రం.

కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే స్నేహితుడి భరోసా.

జ్వరంతో ఉన్న బిడ్డకు లభించే ఓ తల్లి ఓదార్పు.

తమ్ముడి కోసం వస్తున్నా అనే అన్నలాంటి నమ్మకం.

కష్టం గాండ్రిస్తూ మీదకురికినపుడు అతనో వేటగాడి తుపాకీ.

తల్లీ-బిడ్డల మధ్య ఉండే ప్రేమానుబంధం.

2. నారా చంద్రబాబు.

‘‘ఓట్ల వశీకరణ’’ తెలిసిన మాయల మరాఠీ

‘‘ఆంధ్రులు’’ అంటే తామేనంటూ చెప్పుకుంటున్న మేథావి

లక్షల కోట్లను దిళ్ల గలేబుల్లో దాచుకుని

మా దగ్గర బూడిద తప్ప ఏమీ లేదన్న ఏకైక పొలిటికల్ సీఈఓ

అబద్ధాలను తయారు చేసే యంత్రాలున్నవాడు.

మీడియాని ప్రజల మీదకు వదిలేసిన గాడ్ ఫాదర్.

తన అభివృద్ధిని ప్రజల అభివృద్ధిగా చూపినవాడు.

బిల్ గేట్సుకు కంప్యూటరు నేర్పింది తానే.

అమర్త్యసేన్ కు ఒకట్లు నేర్పిందీ తానే.

పత్రికలకు బాబు దీక్ష ఇప్పించగలడు.

పార్టీ నేతల చేత తొక్కుడు బిళ్ల ఆడించగలడు.

అరచేతిలో అమరావతిని చూపించే పీసీ సర్కార్.

3. వైఎస్సార్సీపీ అధినేత జగన్

వైఎస్సార్సీపీ అధినేత జగన్

బొడ్డుపేగు కోసిన నాడే సీఎం అవుతానని అనుకున్నవాడు.

పదవి కోసం 3 వేల కిలోమీటర్లను ఒక్క అంగలో

లంఘించిన వాయుపుత్రుడు.

‘‘పవర్’’ వాకింగ్ పోటీల్లో విజేత

ఇంగ్లిషు ఛానెల్ ఉంటే ఒక్క అంగలో దూకగలవాడు

నెత్తిమీద చేయి పెట్టినా…

ఓదార్పుతో లక్షలను పంచినవాడు.

వందిమాగధుల చేత జగన్ సీఎం అంటూ

‘సాక్షి’లో రామకోటి రాయిస్తున్నవాడు.

2019 ఎన్నికల బరిలో

మొత్తం ముగ్గురు నేతలు…

కానీ, రెండే దారులు.

అదేమిటి ముగ్గురు నేతలు ఉన్నపుడు మూడు దారులు ఉండాలి కదా అంటారా? ఉండవు. రెండే ఉంటాయి. ఎందుకంటే జగన్, చంద్రబాబులది ఒకటే దారి. సీఎం అవ్వాలి అన్న సూపర్ హైవే అది. ఈదారిలో జగన్, చంద్రబాబులు ఉన్నారు. మిగిలిన ఒక్క దారి తారు రోడ్డు కూడా కాదు. గతుకుల రోడ్డు. అది పవన్ ఎంచుకున్న దారి. సామాన్యులు నడిచే మట్టి రహదారి. ఆ దారిలో ఓట్లు కొనడానికి కోట్లు మూటలు కట్టి పడేసి ఉండవు. బాబూ, జగన్ ల దారి కరెన్సీ కట్టలుడే సూపర్ హైవే. కోట్లు పడేసుకుంటూ పోతే సీఎం కుర్చీ వరకూ మలుపులు కూడా లేని దారి. ముగ్గురి వ్యక్తిత్వాలను ఒకసారి విశ్లేషిద్దాం.

ముగ్గురి నేతల వ్యక్తిత్వాలు గానీ, వారి ప్రసంగాలుగానీ ఎలా ఉంటాయి?

ఎవరి మాటల్లో చిత్తశుద్ధి ఉంది? ఎవరు ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయగలరు?

పవన్ ప్రసంగాలు మనీ హైవేలో వెళుతున్న వారికంటే భిన్నంగా ఉంటాయి. పవన్ మాటల్లో వరాల మూటలు ఉండవు. ప్రగల్భాలు కానరావు. హామీలు అసలే ఉండవు. ప్రజల్ని హామీలతో బోర్లాపడేద్దామన్న ఆరాటం అందులో ఉండదు. వాళ్ల ఓట్లను ఎత్తుకుపోదామని ఉండదు. స్వర్గాన్ని కిందికి దించేస్తానని చెబుతాడేమో అనుకుంటాం… ఊహూ. అదీ చెప్పడు.

ఇదిగో మీకు 3 వేలు,

అదిగో మీకు 4 వేలు అంటూ ‘‘మనీ హైవే బాబులు’’ చేస్తున్న ఉచిత పందేరాలు, నీటి మూటలూ ఉండవు. బాబు ‘‘నాలుగు వేలు అన్నాడు… నేను 10 వేలు ఇస్తా తీసుకోండి’’ అంటూ జగన్ మాదిరి చేతులు గాల్లోకి ఊపుతూ ‘‘మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నన్ను సీఎంను చేయండి.. నేను ఇస్తాగా’’ అన్న ఉద్దేశపూరిత అనాలోచిత వాగ్దానాల జడివాన ఉండదు. అయినా పవన్ ప్రసంగాల పట్ల అంత ఆకర్షణ ఎలా వచ్చిందంటే ప్రజల పట్ల అతనికి ఉన్న ‘‘చిత్తశుద్ధి’’.

ఎన్నికలు దగ్గరపడ్డాయి. మేనెల కల్లా ఎన్నికల్ని పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం చెప్పేసింది. ‘మనీ హైవే బాబులు’ హామీలను దంచికొడుతున్నారు. మా హామీల్ని చంద్రబాబు కాపీ కొడుతున్నాడంటూ జగన్ ఒకవైపు ఆరోపిస్తున్నారు. ఈ మనీ బాబులు కురిపించే వరాలతో జనానికి ఒకవైపు ఊపిరి ఆడటం లేదు.

కట్ చేస్తే…

ఎన్నికలు ఉరుముతున్నాయి.. చంద్రబాబు, జగన్ ల మాదిరిగా పవన్ మాత్రం పోటీ పడటం లేదు. ఆదుర్దా పడటం లేదు. వచ్చే నాయకులు, పోయే నాయకులతో రెండు ప్రధాన పార్టీలూ బురద చల్లుకుంటున్నాయి. కానీ పవన్ దేనితోనూ సంబంధం లేకుండా.. చెప్పాల్సిన రెండు ముక్కలు ప్రజలతో చెబుతున్నాడు. 25 కేజీల బియ్యం వద్దు… 25 ఏళ్ల భవిష్యత్తును ఇస్తానంటున్నాడు. 2 వేలు ఇస్తా.. 3 వేలు ఇస్తానని చెప్పి ఇప్పటికిప్పుడు ఓట్లు దండేసుకుని కుర్చీ ఎక్కేస్తే బాగుటుందని మనీ బాబులు ఇద్దరూ పోటీలు పడుతున్నారు. పవన్ మాత్రం నింపాదిగా తన పని తాను చేసుకుపోతున్నాడు.

కుర్చీలో కూర్చున్న చంద్రబాబు, 3 వేల కిలోమీటర్లు నడిచి నడిచి వచ్చాను.. ఇంకో రెండు అంగలు వేస్తే… ఇక సీఎం కుర్చీ నాదే అన్నట్లు జగన్… ప్రజల డబ్బుతో రాజకీయ జూదం ఆడుతున్నారు. ఆశలనే పాచికలుగా విసురుతూ ఏపీ ప్రజలకు ‘‘కనికట్టు’’ కడుతున్నారు.

కట్ చేస్తే…

మరి పవన్..? గనుల దోపిడీని చూస్తున్నాడు. అడవినీ, అడవి బిడ్డల్నీ దోచుకుంటున్న పెట్టుబడిదారులు అతని కళ్లకు కనిపిస్తున్నారు. దూరమైపోతున్న బిడ్డల భవిష్యత్తు అతని కళ్లకు కనిపిస్తోంది. పవన్ కళ్లకు సీఎం కుర్చీ కంటే… ప్రజల కష్టాలపై ఉన్నది. ఎన్నాళ్లీ డబ్బు రాజకీయాలు అంటూ విసుగు చెందుతున్నాడు. ఈ విసుగు అతని ఒక్కడిదే కాదు. సామాన్యులందరిలోనూ ఈ రకమైన విసుగు కనిపిస్తోంది. మార్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు కానీ.. మనం ఏం చేయగలం అన్న నిస్సహాయతే ఎక్కువ మందిలో మొన్నటి వరకూ ఉంది. పవన్ రావడంతో సరిగ్గా ఆయన ఆలోచనలకు ప్రజల ఆలోచనలు పడుగు పేకల్లా కలిశాయి. మార్పు తెచ్చేవాడు ఒకడు వచ్చాడని నమ్ముతున్నారు.

అందుకని… మన జేబులో డబ్బులు తీసుకుని… మనకే చిల్లర పంచి పెడుతున్న వారిని నమ్మాలా లేక యువతరానికి భవిష్యత్తును ఇస్తానన్న వ్యక్తిని నమ్మాలా? అన్న ప్రశ్న ఇపుడు ప్రజల ముందు ఉన్నది.

పవన్ కళ్యాణ్… తెలుగుదేశం, వైస్సార్సీపీల మాదిరిగా… తలో రెండు వేలో మూడు వేలో ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడన్న గ్యారంటీ ఉందా అని ఒక పాఠకుడు ‘‘న్యూస్ ఆఫ్ 9’’ను ప్రశ్నించారు. చెప్పే అవకాశం లేదన్నది మా సమాధానం. పాడేరు బహిరంగ సభకు వెళుతుండగా దారిలో ఒక మహిళ పవన్ కళ్యాణ్ ను కలిసి… ‘‘మాకు 2 వేలు అవసరం లేదు.. మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వండి చాలు’’ అంటూ చెప్పింది అని పవన్ వెల్లడించడమే దీనికి ఉదాహరణ. ఒక నాయకుడు ప్రసంగాలు విన్న తర్వాత ఆ నాయకుడి తేలివితేటల్ని అంచనా వేయడం పెద్ద కష్టం కాదు.

మనీ పార్టీలు.. మూస పార్టీలు

తెలుగుదేశం, వైఎస్సార్సీపీ లు రెండూ కూడా పాత మూస విధానంలోనే రాజకీయాలను నడిపిస్తున్నాయి. అదే.. ప్రజలు పన్నులుగా చెల్లించిన ప్రజాధనంతోనే…ప్రజలకు నాలుగు బిస్కెట్లు పడేస్తే కుక్కల్లా… పడి ఉంటారన్నది మనీ బాబుల ఆలోచన. జగన్ తన సమావేశాలకు హాజరయ్యే వారి కోసం తలకు 300 రూపాయలు ఇస్తున్నారని, సభకు వారిని చేరవేసేందుకు వాహనాలను కూడా సమకూర్చుతున్నారని జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ‘‘న్యూస్ ఆఫ్ 9’’కు సమాచారం అందింది. స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించుకోలేదు కానీ… ప్రజల నుంచి వచ్చిన సమాచారం మాత్రం అది.

పవన్ కళ్యాణ్ సభలకు బిర్యానీలు పెట్టరు.. వచ్చినందుకు డబ్బులు ఇవ్వరు..కానీ లక్షలాదిగా జనం వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వాలపై, ప్రస్తుత పార్టీలపై ప్రజలకు నమ్మకంలేకపోవడమే అందుకు కారణమనీ, తనను చేసేందుకు రావడం లేదని పవన్ కళ్యాణ్ ఉన్న మాటను నిజాయితీగా చెబుతారు. ఇదీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిణతి.

మీడియా కవరేజీ…

సహజంగా నేతలు బహిరంగ సమావేశాల్లో చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెబితే.. రాయాల్సిన అవసరం లేదు. పాఠకుల సమయాన్ని వృధా చేయరాదన్న పాత్రకేయ నియమాలే అందుకు కారణం. సీఎం చంద్రబాబును భుజాలకు ఎత్తుకున్నందున యల్లో మీడియా ఈ సూత్రాలను పాటించదు. చంద్రబాబు చెప్పిందే మళ్లీ మళ్లీ తన ప్రసంగాల్లో చెప్పినా… ఆయా మీడియాలు పొల్లుపోకుండా రాస్తున్నాయి. ఇలా రాయడానికి మేం విరుద్ధం. పవన్ కళ్యాణ్ అనేక జనసేన పోరాట యాత్రల్లో చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పారు. రాయాలా వద్దా అన్న మీమాంస. మా పాత్రికేయ సూత్రాలకు విరుద్ధమైనా వాటిని పొల్లు పోకుండా రాశాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లు వందిమాగధ మీడియాలు పవన్ కళ్యాణ్ కు లేవు. తాను తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చిందీ, ఇపుడు బయటకు వచ్చి ఎందుకు ప్రశ్నిస్తున్నదీ ఆయన మళ్లీ మళ్లీ తన కార్యకర్తలకు, ప్రజలకు చెప్పాలి. మీడియా మద్దతు లేదనందున… ఏకాఎకి స్పష్టంగా ప్రతి బహిరంగ సభలోనూ చెబుతున్నాడు. ఎప్పటికి ఏది నిజమో అదే నిజం. పాత్రికేయులు ఈ రకంగా తమను తాము మలచుకుంటూ ఉండాల్సిందే.

పవన్ ప్రసంగాలను ప్రధాన మీడియా పూర్తిస్థాయిలో కవర్ చేయనందున.. ఆయా సభల్లో పవన్ చెప్పిందే మళ్లీ చెప్పినా జనం ఈలలూ, చప్పట్లతో సమర్ధించారు. సంతోషించారు. సీఎం సీఎం అంటూ కేకలు పెట్టారు. ఆయన సభల్లో ఒక ఆర్తి. ఒక ప్రేమ కళ్లకు కడుతూ ఉంటుంది. కాశీ తువ్వాళ్లను అభిమానులు విసురుతూ ఉంటారు. వాటిని పవన్ చేతితో పట్టుకుని… ‘‘మీ చెమట ఉంది ఇందులో. దాని విలువ తెలుసు’’ అంటారు. జన తరంగం భావోద్వేగంతో ఊగిపోతున్నది. పవన్ కళ్యాణ్ ది జనం భాష. వారి గుండె చప్పుడు పవన్ కి తెలుసు. మీకూ, నాకూ రెండు గుండెలే దూరం అంటాడు. అందుకే పవన్ జన ఘోషతో మమేకమై ప్రతిధ్వనిస్తాడు. పవన్ జనసేన పార్టీని ఒక రాజకీయ పార్టీగా కంటే.. ఒక ఉద్యమ పార్టీగా నిర్వహిస్తున్నాడు. ప్రజలు తన చుట్టూ ఉన్నంత వరకూ పార్టీ ఏమైపోతుందోనన్న బెంగ ఆయనకు లేదు. నిత్యం జనంతో ఉన్నా… జనానికి దూరంగా ఉన్నా… ఆయన చెప్పే మాటల్లో సామాన్యులకు ఓదార్పు ఉంది. దోపిడీని కచ్చితంగా అడ్డుకుంటాడన్న నమ్మకం ఉంది. జనం కళ్లల్లో ఒక చెమ్మ ఉంది. అందుకే పవన్ ఒక ప్రభంజనం. ఆయన ప్రసంగాలు ఒక ప్రభంజనం.

‘‘ఒరేయ్ బాబూ… నేను పవన్ కళ్యాణ్ అన్న వెంట నడుస్తున్నది అతని కోసం కాదు.. నాకోసం, నా భవిష్యత్తు కోసం, నా భార్య కడుపులో పెరుగుతున్న మా బిడ్డ కోసం,నా కుటుంబం కోసం, నా మనుషుల కోసం, నా దేశం కోసం… జై భీమ్

ఒరేయ్ బాబూ…
నేను పవన్ కళ్యాణ్ అన్న వెంట నడుస్తున్నది అతని కోసం కాదు..

నాకోసం,
నా భవిష్యత్తు కోసం,
నా భార్య కడుపులో పెరుగుతున్న మా బిడ్డ కోసం,
నా కుటుంబం కోసం,
నా మనుషుల కోసం,
నా దేశం కోసం
జై భీమ్

పై ట్వీటులోని మాటల్లో పవన్ భావజలం ప్రతిధ్వనించడం లేదా..??

చంద్రబాబు ప్రసంగాలు ఊక. అంకెల ప్రవాహం. సామాన్యుల పట్ల ఆవేదన అందులో కనిపించదు. చంద్రబాబు ప్రసంగం వింటున్నపుడు పేదవాడి హృదయం కదలదు. చంద్రబాబు తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోతారు. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటారు. ముఖ్యంగా సాక్షి పత్రిక వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రసంగాల్లో ఉండే డొల్లతనాన్నీ, మోసాన్నీ కళ్లకు కట్టినట్లు ఆధారాలతో సహా నిరూపించి ఒక మంచి పనే చేసింది. చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తికాదనీ, స్వార్ధపరుడనీ నిరూపించడంలో సాక్షి పత్రిక, సాక్షి ఛానెల్ విజయం సాధించాయి. (చంద్రబాబుకు సాక్షి అంటే మంట. ‘‘సాక్షి కూడా ఒక పత్రికేనా.. ?ఛీ ఛీ’’ అని ఒకసారి బహిరంగంగా ఆయన తిట్టిపోశారు. మరి చంద్రబాబు దృష్టిలో ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రమే నికార్సయిన దినపత్రికలని ఆయన అర్థమా?. ఏ మాటకు ఆ మాట. సాక్షి తన కోసమే పెట్టుకున్నానని జగన్ అందరికీ చెప్పారు. రాజశేఖరరెడ్డి ఫోటోను పత్రికలో ముంద్రించడం ద్వారా సాక్షి కేవలం జగన్ కోసమేనన్నది సుస్పష్టం. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ప్రజల పత్రికలుగా ఒక ముసుగును ధరించాయి. ఇదీ ఘోరం. అలా చూస్తే సాక్షి మంచిది కదా. అందులో ముసుగులు లేవు).

జగన్ ప్రసంగాలు ఎలా ఉంటాయి మరి?

సీఎం కుర్చీ కోసం 3 వేల కిలోమీటర్లు నడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు ఎలా ఉంటాయో చూద్దాం. మొన్న పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన్ను టీవీ 9 ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ప్రజల కష్టాల గురించిగానీ, పాదయాత్రలో తాను తెలుసుకున్న విషయాల గురించిగానీ చెప్పనే లేదు. చంద్రబాబు పాలన సరిగా లేదని మాత్రమే చెప్పారు. చంద్రబాబు ఎందుకు సీఎం కాకూడదో చెప్పారు కానీ… తానెందుకు సీఎం కావాలో చెప్పలేదు. ప్రత్యమ్నాయం లేకపోతే ‘నేను’ అన్న ధోరణి కనిపించింది. ప్రజల కష్టాల గురించిన ‘ఆర్తి’ మచ్చుకైనా కానరాలేదు. అందుకు ఒక అనుభవం, ఆకలి విలువ, కన్నీటి విలువ తెలియాలి. అధికారం కోసం పోరాటం చేయడం వేరు… గంజి మెతుకులే గతి అనుకునే బతుకులను తడిమి చూడటం వేరు.

సీఎంగా ఉండాల్సిన వ్యక్తికి ‘వెలుగు’ విలువ తెలియాలి. ‘చీకటి’ విలువ తెలియాలి. ఆర్థిక శాస్త్రం తెలిసి ఉండాలి. ఇప్పటి వరకూ ఏం జరిగిందో తెలియాలి. లోహియా ఆర్థిక సిద్ధాంతం, ఇంకా అలాంటివెన్నో చదివి ఉండాలి. కేవలం ఐఏఎస్ అధికారుల తెలివి తేటలపై ఆధారపడితే సరిపోతుందా? (40 ఏళ్లు ఇండస్ట్రీ అన్న చంద్రబాబుకి రాఫెల్ యుద్ధ విమానానికీ, సివిలియన్ విమానాలకూ తేడా తెలియదు. ఈ విషయాన్ని బయటపెట్టి తెలుగువారి పరువు తీసిపారేశారు). మందీ మార్బలం ఉంటే చాలా? ఇవన్నీ జగన్ ప్రసంగాల్లో కనిపించవు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చూస్తే ఆయనే స్వయంగా రాసుకుంటున్నారు. మార్టిన్ లూధర్ కింగ్ ను ప్రస్తావిస్తారు. చే గువేరాను ప్రస్తావిస్తారు. 2003 నుంచీ ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపన ఆయనలో ఉంది. ఒక రాష్ట్రానికి సీఎం కావాలంటే… అంతకు ముందు ఆ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉండేవి అన్నదీ ముఖ్యం. పవన్.. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాడు. ఒక ఆలోచన. ప్రజలకు మంచి చేయాలన్న తపన. ఇవన్నీ ఆయన ప్రసంగాల్లో కనిపిస్తుంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఆవేశం ఉంటుంది. ఒక ఆవేదన ఉంటుంది.

జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నపుడు గాలి జనార్ధనరెడ్డి బొగ్గు గనులను ఏ రకంగా దోచుకున్నదీ చూసి ప్రపంచం నివ్వెరపోయింది. బంగారు కుర్చీ చేయించుకుని ఆ కుర్చీలో కూర్చునే స్థాయికి గాలి జనార్ధనరెడ్డిని పెంచింది మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి. డబ్బున్న వాళ్లను కొట్టి.. తద్వారా పేదలకు కొంత మేలు చేసిన మాట వాస్తవమే. కానీ అదే సరిపోతుందా? ఒక వేళ వైఎస్ మంచి వ్యవహారవేత్త అనుకున్నా.. తల్లిదండ్రుల నుంచీ డబ్బు, ఆస్తులూ వస్తాయికానీ.. పిల్లలకు బుద్ధులు కూడా వస్తాయా? ఇవన్నీ ప్రజల ముందున్న ప్రశ్నలే. ఒక సీఎం కుమారుడు కాకపోతే.. జగన్ ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించగలుగుతారు?

సీఎం పదవి అంటే పది తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చని అనేక మంది రాజకీయ నేతలు నిరూపించారు. చంద్రబాబు తీసుకోండి.. ఒక్క మనవడి పేరుతోనే రూ.18 కోట్లు ఉంటే…తాత సంపాదన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జార్ఖండ్ వంటి చిన్న రాష్ట్రానికి సీఎం అయ్యాక మధు కోడా అనే రాజకీయవేత్త రూ.2 వేల కోట్లతో ఆఫ్రికాలో బొగ్గు గునుల్ని కొనుగోలు చేశాడు. తర్వాత సీబీఐకి దొరికిపోయాడనుకోండి. అది వేరే సంగతి. సీఎం పోస్టు అంటే ఏటా 2 లక్షల కోట్లు చేతి కింద ఉంటాయి. దీనిపై తానే సంతకం పెట్టాలని చంద్రబాబు, లేదా 3 వేల కిలోమీటర్లు నడిచినందున తనకే ఆ హక్కు చెందాలని జగన్. ఇలా ఇద్దరూ హోరా హోరీ పోరాడుతున్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆశలతో రాలేదు. సీఎం అయిపోవాలన్న కంగారు లేదని, తాను ఒక ఎలక్షన్ కోసం రాలేదని చెబుతున్నాడు. వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాడు. మళ్లీ చంద్రబాబుకే ఇస్తారో, లేదా జగన్ కే ఇస్తారో ఒకసారి చూద్దామని మీరు భావిస్తే సరేనంటాడు. అందులో సందేహం లేదు. కానీ… ఇప్పటికే ఏపీలో సహజ వనరులన్నీ ఖాళీ అవుతున్నాయి. బడా ప్రాజెక్టులను తెచ్చే నెపంతో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూములన్నీ అన్యాక్రాంతం అయిన తర్వాత ఆంధ్ర అనాధ అవుతుంది.

నీతిని బతికిస్తారా?

అడవిలో ఒక న్యాయం ఉంటుంది. బాగా నున్నగా ఏపుగా పెరిగిన చెట్టును ముందు నరకడానికి ఎంపిక చేస్తారు. నీతిగా ఉంటే ముందు వారిని సమాజం చంపేస్తుందని అంటారు. పవన్ కళ్యాణ్ పెట్టుబడి – అతని నిజాయితీ, అతని నీతి. మరి ఆటవిక న్యాయం కోసం… పవన్ కళ్యాణ్ ను వదులుకుంటామా? నీతిగా ఉంటానన్న పవన్ ను అనేక ప్రశ్నలు వేస్తాం. అవినీతి ఆరోపణలు, అవినీతి డబ్బుతో బొక్కసాలు నింపుకున్న వారిని ఎలాంటి ప్రశ్నలూ మనం అడగంలేం. సాహసించలేం. ఇది లోకరీతి!

ముందు ఆలోచనలో మార్పు రావాలి.

ఏపీ ప్రజల కళ్లలో వెలుగు చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here