జనసేనలోకి తమిళ నాడు మాజీ చీఫ్ సెక్రెటరీ

0
897
Janasena

జనసేనలోకి తమిళ నాడు మాజీ చీఫ్ సెక్రెటరీ

విజయవాడ: సీనియర్ బ్యూరోక్రాట్, తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రెటరీ గా పనిచేసిన పి రామ్మోహన్ జనసేన పార్టీలో చేరారు.

విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనను జనసేన పార్టీలోకి స్వయంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ రామ్మోహన్ ను పొలిటికల్ అడ్వైజర్ గా నియమించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలాడుతూ

‘‘రామ్మోహన్ బ్యూరోక్రాట్ గా అపారమైన అనుభవమున్న వ్యక్తి. ఏఐడీఎంకే ప్రభుత్వానికి చీఫ్ సెక్రెటరీ పనిచేశారు. తమిళనాడులో ప్రభుత్వ పధకాలెన్నింటికో ఆయన దిశానిర్థేశం చేశారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాస్పిటల్ లో ఉండగా తన సామర్థ్యంతో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఆయన పని చేయగలిగారు.

అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని నడపగలిగిన సత్తా ఉన్న అధికారిగా పేరు రామ్మోహన్ తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి జనసేన మీద నామీద నమ్మకంతో పార్టీలోకి వచ్చినందుకు వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞ‌త‌లు తెలియజేసుకున్నాను.

పోలసీ మేకింగ్, ఎలక్షన్ ఎదుర్కోవడంలో ఇలా ఏ విషయంలోనైనా నాకు అవగాహన లేని అంశాలలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి పెద్దలు మాకు అండగా నిలబడడం జనసేన రోజురోజుకూ ఏవిధంగా ప్రజల నమ్మకాన్ని పెంచుకుంటోందన్న దానికి నిదర్శనగా కనిపిస్తోంది.’’ అన్నారు.

Thaminadu

రామ్మోహన్ మాట్లాడుతూ..‘‘ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఆయనకు రాజకీయ సలహాదారుడుగా ఉండడం మరింత ఆనందాన్నిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఎంతో క్లిష్ట పరిస్తితుల్లో ఉందని ప్రజలందరికీ తెలుసు.

ఈరోజు రాష్ట్ర ప్రజలు ఓ కొత్త నాయకుడినీ, నిజాయితీ, త్యాగశీలత ఉండి తమ కోసం తపనపడే నాయకుడు కావాలని కోరుకుంటున్న తరుణమిది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడం సాధారణ విషయం కాదు. బలవంతమైన శక్తులు రాజకీయాలు నడుపుతున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యంగా యువకుల్ని, మహిళల్ని, పేద వర్గాల కోసం పనిచేయాలని వారికోసం అహర్నిశలూ, శ్రమించడం మనందరి భాగ్యంగా నేను భావిస్తున్నాను.

పవన్ కళ్యాణ్ గారితో పరిచయమై కొన్ని వారాలే అయినా జనసేన ప్రజలలోకి ఎలా వెళ్తోందనేది నేను సునిశితంగా పరిశీలించాను. నిజమైన సేవాత్పరత, నిస్వార్థం లాంటివి చాలా అరుదైపోయిన ఈ రోజుల్లో దక్షణభారత దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ తన వృత్తిని పక్కన పెట్టి ప్రజా జీవితంలోకి రావడం చాలా గొప్ప విషయం.

తమను కాపాడడానికి ఎవరో ఒకరు రావాలని ప్రజల్లో కలిగిన ప్రగాఢమైన కోరికే ఒక చారిత్రక అవసరంగా పవన్ ను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయనీ అలాగే నన్ను కూడా వారితో కలిసేలా చేశాయనీ నేను నమ్ముతున్నాను. ప్రజలకోసం పాటుపడుతున్న గొప్ప ఆదర్శాలు కలిగిన పవన్ కళ్యాణ్ ని మనందరం కోరుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి గా చేసేందుకు సకల వనరులను సేకరించి, నా సర్వ శక్తులతో కృషి చేస్తాను. నా మీద నమ్మకంతో నాకు బాధ్యతలను అప్పగించినందుకు నా ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’’ అని అన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here