అమెరికా డల్లాస్ లో NRI డాక్టర్లతో సమావేశంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ గారు

0
1039
Janasena with NRI doctors

#అమెరికా డల్లాస్ లో #NRI డాక్టర్లతో సమావేశంలో #జనసేన అధినేత #పవన్‌కళ్యాణ్గారు->శ్రీకాకుళం నుండి ఉద్దానం భాదితులకు వైద్యసేవలు అందించేందుకు ముందుకొచ్చిన మిషన్ ఉద్దానం వెహికల్ ను డల్లాస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన జనసేనాని…

Janasena with doctors

ఉద్దానం లాంటి సమస్యపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయడానికి హార్వార్డ్ డాక్టర్లను తీసుకొస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు..నాకు కావలసింది మీ దగ్గర నుండి డబ్బు కాదు, ఎంతో కొంత శారీరకంగా పనిచేయటం కావాలి, జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

ఇతర పార్టీల్లాగా కుల విభాగాలు కాకుండా డాక్టర్ల కోసం ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు చేస్తాం..డాక్టర్లు గ్రామీణ స్థాయిలో పనిచేసేందుకు వారికి సరైన నివాస సౌకర్యాలు, పిల్లలకు సరైన విద్యాలయాలు లేవు, అందుకే జనసేన ద్వారా డాక్టర్లకు నివాస సముదాయాలు నిర్మిస్తాం…

10, 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు వచ్చి మార్పు కోసం దాచుకున్న డబ్బు విరాళం ఇస్తుంటే మనం వారి కోసం ఎంతోకొంత పనిచేయకపోతే వారికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, అలా కాకుండా ఉండటం కోసం వచ్చాను మీరు వస్తారని కోరుకుంటున్నాను…

ఎన్నో వ్యాసనాల గురించి చెబుతారు, కానీ మానవత్వం అనేది అన్నిటికంటే పెద్ద వ్యసనం, ఎంతో తృప్తిని ఇస్తుంది, మీలాంటి వారు అందరికి ఇది చాలా ఉపయోగపడుతుంది…

Janasenani

లక్ష మందితో మాట్లాడటం తేలికగా ఉంటుంది కానీ ఇలా కొన్ని లక్షల మందిని కదిలించగల డాక్టర్లతో మాట్లాడాలంటే చాలా కష్టం, మీలాంటి మేధావులతో మాట్లాడటం అంటే కొన్నీ లక్షల మందితో మాట్లాడినట్లే…

అందరిలాగా నేను సాధారణ చదువులు చదువుకోలేదు, పెద్ద విద్యాసంస్థలకు వెళ్ళలేదు, అందుకేనేమో నాకు ఎక్కువ సమయం ఇతర అంశాలను తెలుసుకోవడానికి దొరికింది…

నాకు పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం నాకు నచ్చేది కాదు, అందుకే నేను కాలేజీ చదువులు మానేసి సొంతంగా చదువుకున్నాను..21 ఏళ్ల వయసు వచ్చేసరికి డబ్బు మీద ఆశ పోయింది, పేరు అవసరం లేదు, ప్రపంచాన్నీ మార్చక్కర్లేదు, నన్ను నేను సంస్కరించుకుంటే చాలు అనుకున్నాను…

నాకు తెలిసిన విషయాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను..నా జీవితంలో ఎన్నో సార్లు దారి తప్పాల్సిన పరిస్థితులు వచ్చినా సరే నేను తప్పకుండా నేను బాధ్యతగా జీవించాను…

నా చిన్నతనంలో గీతాంజలి అనే 16 ఏళ్ల యువతి క్యాన్సర్ కారణంగా చనిపోతూ, ఎంతో గొప్ప కవిత్వం రాసింది, అది చదివాక ఆమె పడిన బాధ నాకు చాలా బాధ కలిగించింది, నేను కూడా అలా చనిపోతానేమో అని భయమేసింది…

చిన్నప్పుడు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుంది అనే మాటలు నా చిన్నతనంలో విని చాలా జ్వలించిపోయాను, ఈ ప్రపంచం మారదు అనుకోని శాంతి మార్గం కోసం క్రియా యోగ బాట పట్టాను…

Pawan Kalyan with doctors

నా దృష్టి అంతా ప్రజలు పడుతున్న కష్టాల మీద ఉందేకాని సినిమాల మీద లేదు..నేను గతంలో ఆదిలాబాద్ జిల్లా గోండు తాండాలకు తిరిగినప్పుడు ఒక పెద్దావిడ ఒక కన్ను లేకపోయినా సరే ఏడుస్తుంది,వారు అడిగింది కేవలం ఒక నీటి బోరింగ్.

నేను గోండు మహిళల కష్టాలు చూడలేక ఒక బోరింగ్ వేయించాను, ఇప్పటికి అలాంటి సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాల్లో ఉంది..మనకు భోగాలలో ఉండటం వలన కష్టాల గురించి తెలియడం లేదు..నాకు రాజకీయాలు తెలియవు, నాకు తెలిసినది మానవత్వం…

నా దగ్గరకు వచ్చే కొంతమంది నాయకులు ఏదో ఆశించి, ఏదో ఈ ఎలక్షన్ చూద్దాం, వచ్చే ఎలక్షన్ చూద్దాం అనుకుంటున్నారు, నేను కనీసం ఒక 25 సంవత్సరాల కోసం పనిచేయాలని వచ్చాను, అలాంటి వారిని కోరుకుంటున్నాను…

రాష్ట్రం, ప్రజలు బాగుపడతారు అనుకుంటే నేను మీరు ఎవరికి సపోర్ట్ చేసినా భాదపడను, నేను కోరేది ఒక్కటే ప్రజా సంక్షేమం..నేను సంపూర్ణంగా దేశాన్ని మారుస్తానని చెప్పట్లేదు కానీ నా ఆఖరి శ్వాస లోపు ఎంతోకొంత మార్పు తీసుకొస్తానని నమ్ముతున్నాను…

వేల కోట్లు సంపాదించిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి నా దగ్గర డబ్బు ఉన్నా సంతోషం లేదు శూన్యంతో ఉన్నాను అని అడిగితే ఒక్కటే చెప్పాను ఎంత సంపాదించినా ఎంతో కొంత ప్రజలకు తిరిగి ఇవ్వకపోతే ఆ శూన్యం ఎప్పటికి మన నుంచి పోదు…

కొన్నిసార్లు వ్యక్తిగత గుర్తింపును కోల్పోయి, చావడానికైనా సిద్ధపడి ఇతరులను బ్రతికించడానికి, ఒక సిద్ధాంతాన్ని బ్రతికించడానికి కొంతమంది ముందుకు వస్తారు, అలా నేను ముందుకు వచ్చాను…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here