రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు !

0
1007
Pawan-Kalyan

భీమవరం,గాజువాక స్థానాల నుంచి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ!

జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ఎపి-అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో రెండు స్థానాల నుంచి పోటీ చేయ‌నున్నారు..విశాఖ జిల్లా గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగుతున్నారు..ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ అధికారికంగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది…

bhimavaram

జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా పార్టీ జనరల్ బాడీ ఆయనను కోరింది.శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి పోటీ చేస్తే పార్టీ కి ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకోడానికి జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపింది.

అనంతపురం , తిరుపతి, రాజానగరం , పిఠాపురం, భీమవరం ,గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం , స్తనాలు అగ్ర స్థానాల్లో నిలిచాయి.ఈ ఎనిమిది స్థానాలపై అంతర్గత సర్వే జరిపించిన జనరల్ బాడీ లోని విద్యావేత్తలు ,మేధావులు, ఇతర రంగాల నిపుణులు భీమవరం , గాజువాక స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు.

దీనికి ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్ గారు భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాలనీ నిశ్చయించుకున్నారు. నామినేషన్ ఏ రోజున దాఖలు చేయనున్నది ఈ రోజు సాయంత్రం లేదా రేపు తెలియజేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here