టీ అమ్మిన ఆ చేతుల్లోనే… నేడు టీ గ్లాసు!!

0
1130
machillipatnam janasena

మచిలీపట్నం జనసేన అభ్యర్థి బండి రామకృష్ణ

టీ అమ్మిన ఆ చేతుల్లోనే… నేడు టీ గ్లాసు!!

rama krishna machillipatnamజీవితాన్నీ గెలిచాడు.. ప్రజల్నీ గెలిచాడు
మనసున్న మారాజు… ఈ రామకృష్ణ!!
పులకిస్తున్న మచిలీపట్నం వాసులు.

పేదవాడి ఆకలి విలువ తెలుసు… ఆకలి ముసిరిన వేళ చేతిలో ఉన్న గుప్పెడు మెతుకులు ఇచ్చే సాంత్వన తెలుసు. ఏ స్థాయికి వెళ్లినా… ఎక్కడ నుంచి వచ్చామన్నది మరచిపోకూడదన్న విషయాన్ని ఒక నియమంగా పెట్టుకున్న వ్యక్తి.. పేరు బండి రామకృష్ణ. ఆయన ఎవరో కాదు.. మచిలీపట్నం అసెంబ్లీ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్న మట్టి మనిషి.

మచిలీపట్నం హిందూ కళాశాలలో ఓ చిన్న టీ కొట్టు నడుపుతూ రామకృష్ణ తన జీవితాన్ని ప్రారంభించాడు. కటిక పేదరికం నుంచి వచ్చినా రామకృష్ణ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుని ఒక్కో మెట్టూ కట్టుకుంటూ తనకంటూ ఒక జీవితాన్ని ఏర్పరుచుకోవడంతోపాటు తోటివారికి సాయం చేస్తూ అదే పరమానందం అనుకోవడం రామకృష్ణ దినచర్య.

టీ కొట్టు తర్వాత బజ్జీలు కొట్టు పెట్టాడు. పునుగులూ, బజ్జీలు వేశాడు. ఆ వచ్చిన డబ్బుతోనే మళ్లీ చదువుకునే విద్యార్ధుల కోసం మెస్సులు నడిపించాడు. కాలం కలిసివచ్చింది అనండి… అదృష్టం అనండి.. కాస్త డబ్బు సంపాదించాడు. మచిలీపట్నంలో ఇపుడు ఆర్కే మెస్సులూ, హోటళ్లు మచిలీపట్నంలో ఇంటింటికీ పరిచయం ఉన్న పేరు.

ఎంత సంపాదించినా… తోటి వారి గురించి ఆలోచించే రామకృష్ణ అనేక మంది పేద విద్యార్ధులకు సాయం అందిస్తూ చదువు చెప్పిస్తున్నాడు. ఈ విషయం పది మందికీ చెప్పమంటావా రామకృష్ణా.. అంటే అబ్బే వద్దులెండి.. చేసిన సాయం పది మందికీ చెప్పుకోవాలా ఏమిటీ అంటూ నవ్వుతూ వెళ్లిపోతాడు. ఆ మధ్య మంగినపూడి బీచ్ ఫెస్టివల్ పెడితే… రామకృష్ణ అక్కడ ఒక ఫుడ్ స్టాల్ పెట్టారు. వెళ్లిన వాళ్లందరికీ పిండి కలుపుతూ పునుగులు వేస్తూ కనిపించాడు.

తెలిసిన వాళ్లు.. చూసి అవాక్కయ్యారు. ‘‘రామకృష్ణ గారూ… మీరు ఈ స్థాయిలో ఉండి.. ఇంకా ఈ పనులన్నీ చేయడం ఏమిటండి?’’ అంటూ వారించే ప్రయత్నం చేశారు. ‘‘అయ్యో.. భలేవారండీ… నేను వచ్చిందీ… డబ్బు సంపాదించిందీ ఈ పునుగులు వేసుకునే కదాండీ.. ఇందులో అవమానం ఏముందండీ… మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోకూడదంటే ఈ పని చేస్తూనే ఉండాలి. దాని వల్ల మన స్థాయి మనకు ఎప్పుడూ గుర్తుంటుంది. లేకపోతే కొమ్ములు వస్తాయి’’ అంటూ అడిగిన వారికి సమాధానమిచ్చాడు రామకృష్ణ.

రేవతి సినిమా థియేటర్ దగ్గర రామకృష్ణకు ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో తయారు చేసిన ఆహార పదార్ధాలు కొన్ని మిగిలిపోతాయి. అలాంటివాటిని రోడ్డుపైన పారబోయడం ఇష్టంలేని రామకృష్ణ ఆ హోటల్ బయటే ఒక ఫ్రిజ్ పెట్టి అందులో మిగిలిన ఆహారాన్ని ఉంచుతాడు. ఆకలిగా ఉన్నవారు.. నిరుపేదలూ ప్రతిరోజూ అక్కడికి వచ్చి అందులో ఆహారాన్ని తీసుకుని అక్కడే తిని వెళ్లిపోవచ్చు. లేదా వెంట తీసుకుని పోవచ్చు.

machillipatnam janasena

విద్యపై ఉన్న ప్రేమతో…. ఆర్ కే జూనియర్ కళాశాల కూడా ప్రారంభించాడు రామకృష్ణ. చదువుకుంటే అది పేదరికం నుంచి స్వేచ్ఛను కల్పిస్తుందని నమ్ముతాడు రామకృష్ణ. అందుకే కళాశాలను ప్రారంభించాడు. పేదల పిల్లలకు చదువుకునేందుకు అందులో అవకాశం కల్పిస్తాడని వేరే చెప్పక్కర్లేదు. రామకృష్ణ సేవాభావం, మంచితనం వల్ల మచిలీపట్నంలో రామకృష్ణ అంటే అందరికీ ఇష్టుడు.

కష్టజీవిగా… ఆకలి విలువ తెలిసిన మట్టి మనిషిగా అందరూ ఆయన్ని అభిమానిస్తారు. జనసేన పార్టీ రామకృష్ణకు మచిలీపట్నం అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ ఎన్నికలకు ఆయన మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్ధి పేర్ని నానితోనూ, తెలుగుదేశం అభ్యర్ధి కొల్లు రవీంద్రతోనూ పోటీ పడుతున్నారు. రామకృష్ణ గెలుపు తథ్యమని ఆయన అభిమానులు చెబుతున్నారు. అత్యంత సామాన్యుడినీ, ఒక మంచి హృదయం ఉన్న వ్యక్తినీ వెదికి మరీ.. జనసేన మచిలీపట్నం అభ్యర్ధిగా ప్రకటించడంపై మచిలీపట్నం వాసులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here