కైకలూరు జనసేన అభ్యర్థి సిఏ బివీరావును అంభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

0
802

జనసేన పార్టీ సిద్ధాంతాలైన కులాలను కలిపే విధానం ఆచరణ చేసి చూపిన సిఎ బీవీరావును అభినందించిన జనసేనాని, సీఏ బీవీరావు భార్య శ్రీమతి డాక్టర్ అనూష దళిత క్రైస్తవురాలుగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేనపార్టీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా తక్కిన అభ్యర్థులకు వ్యక్తిగతంగా బీ-ఫారాలు అందజేసి కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి అయిన శ్రీబీవీరావును సతీ సమేతంగా తన వద్దకు ఆహ్వానించి వీరి ఆదర్శాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈసందర్భంగా శ్రీమతి డాక్టర్ అనూషాబీవీరావు మాట్లాడుతూ సమాజంలో బడగు బలహీన వర్గాల వారిని ,మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే తక్కిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ వగైరా పార్టీలకు భిన్నంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు దళిత జాతి అభ్యున్నతి కోసం స్వర్గీయ కాన్షీరామ్ గారు ఏర్పాటు చేసిన బహుజన సమాజ్ వాది పార్టీ నేతాశ్రీ కుమారి మాయావతి గారిని కలిసి పొత్తు పెట్టుకుని బలహీన వర్గాలతో ముందుకు సాగడం ద్వారా దళిత బలహీన,మైనారిటీ వర్గాలకి జనసేన పార్టీ ఇచ్చే ప్రధాన్యత ప్రజలు గ్రహించి జనసేన పార్టీకి అండగా నిలబడాలని కోరారు.

గాజుగ్లాసు గుర్తుకు ఓట్లు వేద్దాం దళిత జాతి ముద్దుబిడ్డ కుమారి మాయావతిగారిని ప్రధానమంత్రిని చేద్దాం నీతీనిజాయతీలు కలిగిన పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిని చేద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here