నా జీవితంలో ఒక్క పథకానికి కూడా పవన్‌కళ్యాణ్ పేరు పెట్టుకొను

0
879
Pawan

జనసేన ఎన్నికల శంఖారావంలో భాగంగా నిన్న నూజివీడుమైలవరం,  విజయవాడ-పశ్చిమ, సెంట్రల్తూర్పు నియోజకవర్గ సభలో పాల్గొన్న జనసేన అధినేత  పవన్‌కళ్యాణ్ గారు నా జీవితంలో ఒక్క పథకానికి కూడా నా పేరు పెట్టుకొను అని మీకు మాట ఇస్తున్నాను…

వైసీపీ వాళ్ళు పేపర్ ఛానెల్ ఉన్నాయి కదా అని నోటికొచ్చింది రాస్తున్నారు, మా పార్ట్నర్ టీడీపీ అని ప్రచారం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎన్ని సార్లు ప్రూవ్ చేసుకోవాలి మేం, మళ్ళీ చెప్తున్నాం మా పార్ట్నర్ బీఎస్పీ, మా పార్ట్నర్ సీపీఐ, మా పార్ట్నర్ సీపీఎం…

మాట్లాడితే జగన్ గారు అన్నీ ముఖ్యమంత్రి అయ్యాకే అంటాడు, అసలు మీరు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఏం మిగులుతుంది బూడిద తప్ప…

ఈ రోజున కేసీఅర్ గారు జగన్ గారికి దొడ్డిదారిలో మద్దతివ్వడం సరి కాదు, పెద్దలు కేసీఆర్ గారు తటస్థంగా ఉండాలి, మీరు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేఖం అయితే మాకూ సంతోషమే, మేం కూడా ఆయనకి వ్యతిరేఖం. ఆయన అవినీతి పాలన, వాళ్ళ ఎమ్మెల్యేల అవినీతి పాలన చూసి విసిగిపోయాం…

టిడీపీ చేసేది వ్యాపార ధోరణితో కూడిన రాజకీయం తప్ప ప్రజా సంక్షేమం కోసం పని చేసే పార్టీ కాదు, పది సంవత్సరాల ఉమ్మడి రాజధానిని సైతం తాము చేసిన తప్పులకు వదిలేసి వచ్చిన పార్టీ అది…

టీడీపీ, వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వీళ్ళకి సమాధానం చెప్పే రోజు వస్తాది అని ఎదురుచూసాను…

సింగపూర్ తరహా రాజధాని ఉండాలని అంటారు చంద్రబాబు గారు, సింగపూర్ లో భూ ఆక్రమణలు ఉండవు, ఆడపిల్లల పై బెదిరింపులు ఉండవు, రౌడీయిజం ఉండదు, గుండాయిజం ఉండదు, మరి మీ ఎమ్మెల్యేలే భూ కబ్జాలు చేస్తూ బెదిరిస్తే ఇంకెక్కడ ఉంటుంది సింగపూర్ తరహా రాజధాని.??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here