ఓటరు నమోదు – ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం

0
2247
voteridcardin-AP

ఓటరు నమోదు – మీకు జనవరి 1,2019కి 18 సంవత్సరాలు నిండి, మీ పేరు ఓటరు జాబితాలో లేనట్లయితే వెంటనే మీ పేరు ఓటరుగా నమోదు చేసుకోగలరు. ఓటరు నమోదుకు చివరి తేదీ 31 అక్టోబరు 2018.

పూర్తి చెయ్యవలసిన దరఖాస్తు : ఫారం 6

కావలసిన డాకుమెంట్స్ : ఒక పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్, 10th క్లాస్ మార్క్స్ జిరాక్స్

రిజిస్ట్రేషన్ విధానం 1 : ఆన్లైన్ విధానం. మనం సొంతంగా www.nvsp.in website లో ఫారం 6 నింపి డాకుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి.

ఓటరు నమోదు

రిజిస్ట్రేషన్ విధానం 2 : ఈ-సేవ ఆన్లైన్ విధానం. మనకి లాప్టాప్ లేకపోతే మీ ఊరిలో ఈ-సేవ పోర్టల్ ద్వారా ఫారం 6 నింపి డాకుమెంట్స్ అప్లోడ్ చేయించాలి. దీనికి 50రూ. తీసుకుంటున్నారు.

రిజిస్ట్రేషన్ విధానం 3 : జనసేన పార్టీ వారు జన బాట అనే కార్యక్రమంలో ఓట్లు చెక్ చేసి, ఓటు లేని వారికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. జన సైనికులు ద్వారా ఫారం 6 నింపి డాకుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి.

రిజిస్ట్రేషన్ విధానం 4 : మీ మండలం MRO ఆఫీసులో ఫారం 6 తీసుకుని, అది నింపి దానికి ఫోటో, డాకుమెంట్స్ జత చేసి సంబంధిత గుమస్తాకి ఇవ్వవచ్చు.

రిజిస్ట్రేషన్ విధానం 5 : అక్టోబరు 31 వరకు ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 10 గం. నుండి 5 గం. వరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో బూత్ లెవెల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. మీరు మీ పాస్పోర్ట్ ఫోటో, డాకుమెంట్స్ తీసుకొని వెళ్లి దరకాస్తు ఫారం 6 నింపి ఇస్తే తీసుకుంటారు.

మీకు ఓటరు నమోదు కు ఇబ్బంది అయితే మీ ఊరి VRO ని సంప్రదిస్తే తగిన సలహా ఇచ్చి సహాయం చేస్తారు. ఎలా అయినా సరే ఓటు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకొండి. మర్చిపోవద్దు. రిజిస్టర్ చేసుకోక పోతే 2019 ఎలక్షన్స్ లో ఓటు వేసే అవకాశం కోల్పోతారు. రిజిస్ట్రేషన్ కి ఆఖరు తేదీ 31 అక్టోబర్ 2018.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here