పాతిక సంవత్సరాల భవిష్యత్ ప్రస్థానం

0
704
జనసేన

ఎంతటి ప్రయాణమయినా ఒక అడుగుతోనే మొదలవుతుంది!!
అలా మొదలయినదే ఈ జనసేన ప్రస్థానం కూడా!!
ఒక సామాన్య మానవుడు ఒకసారి దెబ్బతిన్న తర్వాత తిరిగి ఆ దారి గుండా పోవలంటేనే సంకోచిస్తాడు, అలాంటిది ప్రజారాజ్యం తాలూకు అనుభవాలని దిగమింగుకొని, ఎవరూ ఊహించని విధంగా ఏదో సమాజానికి తనవంతు కృషి చేయాలన్న తపనతో అన్ని వదులుకొని తిరిగి ఈ కుళ్ళు, కుతంత్రాలు కలగలిసిన రాజకీయం అనే మురికి కూపం లోనికి వచ్చాడు!!
మొదలు పెట్టిన నాటి నుంచి కూడా వ్యతిరేకులు రాజకేయరాబంధుల్లా తొక్కేయాలని ఎంతో చూశాయి, చూస్తూనే ఉంటాయి కూడా!!
కాని వేటికీ తలొగ్గక తను నమ్మిన సిద్దాంతాలయిన నీతి, నిజాయితీ, నిబద్దత లతోనే ముందుకు సాగాడు!!
వ్యతిరేకులకు చేసేదేమీ లేక, విమర్శించటానికి దిక్కుతోచక ఎలా దిగజారారంటే అనామకులచేత అనారానిమాటలని అనిపిస్తూ, చివరికి వ్యక్తిగత ధూషణాలకి సైతం దిగి, తను ఇష్టపడే మార్తుమూర్తిని కూడా వదలలేదు ఆ నీచులు!!
ఎన్ని జరిగినా తన సైన్యాన్ని అదుపు చేస్తూ, ఎటువంటి గంధరగోళాలకి తావివ్వకుండా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు నడిపించాడు!!
అందులో మరీ ముఖ్యంగా తనని ఉపయోగించుకొని ఒక ప్రభుత్వాన్నే ఏర్పరిచిన వారు సైతం, ఏరు దాటాక తెప్ప తగలేసిన చందానా ఎన్నో అవమానాలకి గురిచేశారు, వారి కుల మీడియా లని ఉపయోగించి ఇక రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్టు విమర్శలు చేశాయి!!
ఇన్ని జరుగుతున్నా ఎంతో ఓపికతో బరించాడు, కాకపోతే అలా అని స్తబ్దుగా ఉండకుండా, సరైన సమయం చూసుకొని తన పదునైన వాక్చాతుర్యం తో విమర్శలని తిప్పికొడుతూ, మీడియా యజమణులకి సైతం చెమటలు పట్టించాడు!!
ఇక రాజకీయ విమర్శలు కోకొల్లలు, మొదలు పెట్టిన రోజునుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో విమర్శలు చేశారు!!
అందులో మరీ ముఖ్యంగా మీ పార్టీ క్యాడర్ ఎక్కడ, కాండిడేట్స్ ఎక్కడ, పార్టీ సింబల్ ఎక్కడ, అసలు పోటీ చేస్తున్నారా ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో విమర్శలు!!
కాకపోతే వారికి తెలియకుండానే చాపకింద నీరులా రాష్ట్రం నలుమూలలా ఉన్న అభిమానులే జనసైనికులు అవుతారని తెలుసుకోలేక పోయారు!!
మరీ ముఖ్యంగా కళ్యాణ్ గారు క్యాడర్ తో ఎప్పుడూ చెప్పే ఒక విషయం, రాజకీయం, ఎత్తుకు పైఎత్తులు నేను చూసుకుంటాను మీరు మాత్రం మీకు తగినంతలో పార్టీ ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేవారు!!
మాట ఇచ్చిన ప్రకారం తను తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అభ్యర్థులని ఎన్నుకోవడం,BSP తో పొత్తు ప్రతి ఒక్కటి కూడా ఎవరూ ఊహించని విధంగా మేధావులకి సహితం ఔరా అనిపిస్తున్నాయి!!
మీ నాయకుడి అనుభవం, ప్రణాళికలు, సింద్ధాంతాలు, మేనిఫెస్టో అవి ఇవి అని ఎన్నో మాట్లాడారు, చివరికి ఎవరికీ అంతుచిక్కని విధంగా పార్టీ లోకి ఎంతో మంది మేధావులు వచ్చి చేరారు. అందులో IAS, IPS, IFS,IRS, Ex Army ఇలా అందరూ కుడా మంచి మంచి ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళే, మరియు ఏ ఒక్కరికి కూడా అవినీతి కాని, నేర చరిత్ర కానీ లేని అసలు సిసలైన వారే. దానికి నిదర్శనం ఇవ్వాళ జాయిన్ ఐన జేడీ లక్ష్మినారాయణ మొదలుకొని తోటా చంద్రశేఖర్ రావు వరకూ అందరూ ప్రముఖ శాఖల్లో పని చేసిన వారే!!
ఇక మేనిఫెస్టో గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే, ప్రతి సామాన్యుడికి కూడా ఎంతో అవసరమైన మరియు ఉపయోగపడే విధంగా ఉంది. ముఖ్యంగా రైతులకి, విద్యార్థులకి ఎవరూ ఊహించని విధంగా గొప్పగా పొందుపరిచారు!!
ఇక అనుభవం అంటారా చిత్త శుద్ధి లేని అనుభవం ఉన్నా లేనట్టే, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి విధి విధానలేవి కూడా అనుభవ లేమిని ఎక్కడా కూడా మచ్చుకైనా కనిపించట్లేదు కదా, చేసే ప్రతిదీ కూడా ఎంతో అనుభవం ఉండి, మేధావులని కూడా ఆలోచిపచేసేవిధంగా ఉన్నాయి!!
కాకపోతే ఒక్కటి మాత్రం మనస్పూర్తిగా చెప్పగలను, ఈ ప్రయాణం ఎంత దూరం వెళ్తాదో తెలియదు గాని, నాలాంటి ప్రతి యువతీ, యువకుల్ని రాజకీయాలమీద అవగాహన కల్పించింది మాత్రం మీరే!!
మీగురించి ఎంత చెప్పినా తక్కువే కళ్యాణ్ గారు, చివరగా మీ/మా గొప్ప ఆశయం నెరవేరాలని దానికి మీ కష్టానికి, త్యాగానికి మా వంతు కృషి మేము అందిస్తామని ఒక జనసైనికుడిగా మాట ఇస్తున్నాను!!

మన విలువైన vote ని జనసేన పార్టీకి వేసి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం vote for glass 🥛 !!

జై జనసేన!! జై జై జనసేన!!
#VoteForGlass

రాజు సుంకర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here