మనోహర్ పారికర్ కన్నుమూత

0
701
Goa CM

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఇకలేరు. 63 ఏళ్ల పారికర్ కొంతకాలంగా పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. విదేశాల్లో కూడా చికిత్స పొందినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. కొద్ది సేపటి క్రితం పారికర్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ మేరకు సీఎంఓ అధికారిక ట్విటర్ అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. సీఎంను కాపాడేందుకు మెరుగైన చికిత్స అందిస్తూ డాక్టర్లు శాయశక్తులా యత్నించారని తెలిపింది.

మనోహర్ పారికర్

గోవాకు మూడుసార్లు సీఎంగానే కాకుండా రక్షణ మంత్రిగా కూడా పారికర్ సేవలందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విటర్ ద్వారా పారికర్‌కు నివాళులర్పించారు. పారికర్ సేవలను కొనియాడారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here