పుంగనూరు ప్రాంతంలో పతంజలి పరిశ్రమ !!

0
728
పుంగనూరు

పుంగనూరు ప్రాంతంలో పతంజలి పరిశ్రమ కోసం శ్రీ రాందేవ్ బాబా గారిని అభ్యరించిన పుంగనూరు JSP ఎమ్మెల్యే అభ్యర్థి బి. రామచంద్ర యాదవ్ గారు

ఈ రోజు అనగా 25-04-2019 గురువారం ఉత్తరాఖండ్ రాష్ట్రములోని హరిద్వార్ లో ప్రఖ్యాత యోగా గురువు, పతంజలి ఆయుర్వేద పరిశ్రమల అధినేత శ్రీ రాం దేవ్ బాబా గారిని తన సొంత స్వగృహంలో కలిసిన యువనేత రామచంద్ర యాదవ్ గారు.

ఈ సందర్భంగా పుంగనూరు లో చింతపండు ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ పతంజలి ఆయుర్వేద పరిశ్రమ నెలకొల్పడానికి తగిన అనుకులతలను వివరిస్తూ, పుంగనూరు లో టమోటా ఎగుమతులు మరియు ఇక్కడి అనుకూల వాతావరణ పరిస్తుతులను వివరించారు.

అలాగే చుట్టు పక్కల రాష్ట్రాలకు అతి తక్కువ దూరంలో ఉన్న పుంగనూరు కు గల వ్యాపార అనుకులతలను క్షుణ్ణంగా వివరించారు. అరగంట పాటు సుదీర్ఘంగా రామచంద్ర యాదవ్ గారు సమర్పించిన విజ్ఞప్తిని పరిశీలించిన రాం దేవ్ బాబా గారు చాలా సానుకూలంగా స్పందించారు. అంతేకాక త్వరలోనే పుంగనూరు వచ్చి పరిశ్రమ నెలకొల్పడానికి తగిన అనుకులతలను స్వయంగా వీక్షించేందుకు సంసిద్ధత తెలిపారు.

పుంగనూరు అభివృద్ధి కోసం రామచంద్ర యాదవ్ గారు పడుతున్న తపన చూసి పుంగనూరు ప్రజలు అభినందిస్తున్నారు.

పుంగనూరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here