మంచి చేస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ పై రాళ్లేస్తారా…?

0
1045
janasenani

● భాజపా మాట ఆయన నోట రాలేదు… కానీ ఆ పదాల్ని కలిపేశారు.

● మోడీపైన కోపంతో నేషనల్ హెరాల్డ్ ఘోర తప్పిదం.

● పాక్ మీడియా సంస్థ డాన్ కూడా అదే పని చేసింది.

● మోడీపై కోపంతో… దారుణానికి ఒడిగట్టిన ప్రతిపక్షాలు.

janasenani

పాక్ యుద్దంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని మీడియా వక్రీకరించి తమ వక్రబుద్ధిని బయట పెట్టుకున్నది. తీవ్రవాదుల అణిచివేతను అడ్డంగా పెట్టుకుని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం యుద్ధానికి కాలుదువ్వుతుందన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. హిందువుల ఓట్ల కోసం ఒకప్పుడు రామజన్మభూమి అంశాన్ని ఉపయోగించుకున్న భాజపాకి ప్రస్తుతం చేతిలో ఎలాంటి ఆయుధాలూ లేవు. దానికి ఉన్న ఒకే అవకాశం దేశభక్తిని రెచ్చగొట్టడం ఒక మార్గం. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని భాజపా ఓట్లను కొల్లగొట్టేందుకు ఉపయోగించుకుంటుదన్న అనుమానం చాలా మందిలో ముఖ్యంగా ప్రతిపక్షాల్లో ఉంది. కానీ.. బాహాటంగా ఆ మాట అంటే దేశద్రోహులు అన్న ముద్ర వేస్తారు. కానీ… భాజపాని ఇరుకున పెట్టడానికి అటు పాకిస్థాను మీడియాకీ, ఇటు ప్రతిపక్షాలకు మద్దతుగా ఉన్న మీడియా సంస్థలకు ఒక ఆయుధం కావాలి.

‘‘పాక్ తో యుద్ధం వస్తుందని రెండేళ్ల కిందటే వార్తలు వచ్చాయి…’’ అని పవన్ కళ్యాన్ అన్న మాటల్ని భాజపానీ, పరోక్షంగా మోడీని తిట్టాలనుకున్న శక్తులకు పవన్ మాటలు లడ్డూలాగా దొరికాయి. పవన్ అన్న మాటల్ని కాంగ్రెసు నేతృత్వంలో నిర్వహిస్తున్న ‘‘నేషనల్ హెరాల్డ్’’ ఆంగ్ల వార పత్రిక తన నెట్ ఎడిషన్లో ప్రచురించి ట్వీట్ కూడా చేసింది. భారత ప్రభుత్వం… 2 ఏళ్ల కిందటే పాక్ పై దాడి చేయాలని ప్రణాళిక వేసుకుంది అని చెప్పడానికి పాక్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ప్రకటనను వాడుకున్నది. పాకిస్థానులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పెద్ద మీడియా సంస్థ డాన్. ఈ పత్రిక కూడా మోడీని అభిశంసిస్తూ పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని ఉదాహరించింది. ‘‘భాజపా నాకు ఈ విషయం చెప్పింది’’ అన్న ప్రస్తావన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఎక్కడా లేదన్నది వాస్తవం. అయినా… మోడీపై ఉన్న శత్రుత్వంతో పవన్ మాటలకు విస్తృత ప్రచారం కల్పించింది. ‘‘భాజపా చెప్పినట్లు’’ అన్న ముక్కల్ని కూడా వారు పవన్ ప్రసంగానికి జత చేసి వాడుకోవడాన్ని బట్టి మీడియా లేదా ఆ మీడియా సంస్థల వెనుక ఉన్న ఉద్దేశం అర్థం అవుతుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అనని మాటల్ని అన్నట్లుగా రాయడం మీడియా నైతిక సూత్రాలకు విరుద్ధం.

c

నిజానికి ఉత్తరాదిలోని మీడియా సంస్థలు వార్తల కోసం మన దగ్గరున్న మీడియా సంస్థలపై ఆధారపడతాయి. మన వాళ్లు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే అలవాటు లేనందునే… తెలుగు మీడియాకు యల్లో మీడియా అన్న అందరూ ముద్దు పేరు పెట్టుకున్నారు. నాకు తెలిసి… 25 ఏళ్ల కాలంలో ఈ తరహా దుర్మార్గాన్ని నేను ఎక్కడా చూడలేదు. తామర తంపరగా అల్లుకుపోయినా టీవీ ఛానెళ్ల వల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతోంది. మీడియా సంస్థలు ఎక్కువగా ఉన్నందున సమాజానికి ఎక్కువ లాభం జరగాలి. ఇప్పుడు లాభం జరగకపోగా… నష్టం జరుగుతోంది.

ఏపీలో తెలుగుదేశం పార్టీ భాజపాపైన, నరేంద్రమోడీపైన కత్తి కట్టిన విషయం తెలిసిందే. వింగ్ కమాండర్ అభినందన్ కు స్వాగతం చెప్పేందుకు వాఘా సరిహద్దుకు ప్రధాని వెళ్లకపోవడాన్ని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తప్పుపడుతున్నారు. తన రాజకీయ అవసరాలకు ‘‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’’ అన్న నెపంతో ఆయన చేస్తున్న ‘‘దొంగ యుద్ధం’’ ఏ విపరిణామాలకు దారితీస్తుందో తెలియకుండా ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై బురద చల్లుతున్నది. ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పనని, తమ రాష్ట్రానికి కూడా సార్వభౌమాధికార హక్కులు ఉంటాయని వాదిస్తున్న సీఎం చంద్రబాబు ధోరణిని బుర్ర ఉన్న ఏ పాత్రికేయుడూ జీర్ణించుకోలేడన్నది వాస్తవం. కానీ.. చంద్రబాబు కోసం మోడీని ఇరుకున పెట్టేందుకు c కూడా దుర్భిణీ వేసి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నది.

ఇది పూర్తిగా అనైతికం. మీడియా ఇంకా మెగా బ్రదర్స్ పై ఇంకా విషం చిమ్మూతూనే ఉంది. ఎలాంటి మీడియా సహకారం ఉండదని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఈ దుర్మార్గపు వ్యవస్థపై పోరాటానికి దిగడం ఒకింత ఆశ్యర్చానికి గురి చేస్తోంది. అసాధారణమైన యుద్ధమిది. ఒకరో ఇద్దరిపై పోరాటం చేయడం ఎవరికైనా సులువు. కానీ పవన్ కళ్యాణ్… గత 70 ఏళ్లుగా రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న వారిని సవాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని సాహసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అవినీతికి పాతర వేసి… పూర్తిగా ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని పవన్ చెబుతున్నపుడు… అవినీతి ఆరోపణలు ఉన్నవారు జనసేనలోకి సహజంగానే రాలేరు. తెలుగుదేశం ఒకవైపు, వైసీపీ మరోవైపు, ఈ రెండు పార్టీల వెనుక ఉన్న పెట్టుబడిదారులు అందరికీ ఇపుడు పవన్ ప్రథమ శత్రువు అయిపోతున్నారు. ఒక వ్యక్తిని వ్యతిరేకించడం వేరు… అసలు ఈ వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించి పేదవాడిని రాజును చేస్తానని అనడం వేరు. పవన్ కళ్యాణ్ రెండో పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని ఇంతకు ముందు గానీ… రాబోయే భవిష్యత్తులోగానీ చూస్తామన్న నమ్మకం లేదు. ప్రతి వ్యక్తి కూడా తన అనుభవాల సమాహారం. పవన్ పెరిగిన పరిస్థితులు, ఆయన ఆలోచనలూ, తాను చదివిన పుస్తకాలూ ఆయన్ను అలా తీర్చిదిద్దాయి.

సామాన్య ప్రజలకు పట్టం కంట్టేందుకు ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ఇది పెద్ద యుద్ధమే. దుర్మార్గమైన వ్యవస్థతో ఒక మంచి మనిషి మొండిగా చేస్తున్న పోరాటం. ఊ అన్నా.. ఆ అన్నా… ఇదిగో పవన్ ఇలా అనేశాడు… అలా అనేశాడు అంటూ చిలవలు పలవలు చేసి అల్లేసి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు మీడియా సంస్థలు, వారి వెనుక ఉన్న పెట్టుబడిదారులు వేట కుక్కల్లా కాచుకుని ఉన్నాయి. బలహీన బడుగు వర్గాల రాజ్యాధికారం కోసం.. ఎదురుగా ఉన్న ఈ రక్త కాసారాన్ని ఆయన ఎలా ఈదుకువస్తారో…!!

గమనిక: ఒక ప్రొఫెసర్ డిసెంబర్ 11వ తేదీన చేసిన ట్వీట్ ను గమనించగలరు.

Pawan Kalyan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here