నేను దెబ్బతిన్న బెబ్బులిని – కడప లో జనసేనాని

0
1043

కడప లో ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. -కడపలో జనసేన అధినేత శ్రీ

జనసేనాని
మార్పు రావాలి, అవినీతి పై పోరాడాలి దానికి అందరూ ముందుకు రావాలి.

రాయల సీమ, వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనక్కు నెట్టబడ్డ ప్రాంతం.

మార్పు వచ్చిన రోజున ఎంత మందిని మీరు భయపెట్టగలరు?

ఈ రోజున ఇంత మంది యువత రోడ్ల మీదకు వచ్చి, జనసేన జనసేన అంటున్నారు, అంటే వాళ్లు మార్పు కోరుకుంటున్నారు, రాయల సీమ స్వేచ్ఛను కోరుకుంటుంది.

కడప జిల్లాకి ఓట్లు కోసం రాలేదు మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. -కడపలో జనసేన అధినేత శ్రీ

గ్రూపు వర్గ రాజకీయాలు నుండి రాయసీమకి కావలసింది స్వేచ్ఛ, ఆజాది.

వేల ఎకరాలు, వేల కోట్లు దోచుకుంటున్నారు నాయకులు. రాయలసీమ వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబడిన ప్రాంతం.

కొంతమంది నాయకులు చెప్తూంటారు తొండ కూడా గుడ్లు పెట్టలేదని….మరి కానీ వాళ్ళల్లో మాత్రం బంగారప్పు గుడ్లు ఎలా వస్తున్నాయో తెలియడం లేదురాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనక్కినెట్టపడ్డ ప్రాంతం:- కడపలో జనసేనాని పవన్ కల్యాణ్ గారు#JanasenaniInRAYALASEEMA #JanaSenaPorataYatra

Posted by Balu Manku on Wednesday, 27 February 2019

ప్రైవేట్ సైన్యంతో, రౌడీలతో రాజకీయం చేసే వాళ్లు మీకే అంత ధైర్యం ఉంటే, దేశం కోసం చచ్చిపోయే వాడిని నాకు ఎంత ధైర్యం ఉండాలి.

జనసేన జెండా లేని గ్రామం లేదు. ప్రతీ గ్రామం మార్పు దిశగా ఆలోచిస్తోంది.

కేవలం కొన్ని కుటుంబాల పాలనతోనే రాయలసీమ నలిగిపోతోంది.

జగన్ మాట్లాడితే చెబుతున్నారు మేము టీడీపీ తో జత కట్టాం అని, అరేయ్… టీడీపీ మెడలు వంచి, ప్రశ్నించి, ప్రజాక్షేత్రంలో నిలబెట్టింది మేము.

భయపెట్టే వాడు నాయకుడు కాదు, స్వేచ్ఛను ఇచ్చేవాడు నాయకుడు.

రౌడీ నాయకులకు చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొమ్ములు పీకి పారేస్తా జాగ్రత్త .

రెడ్డి అంటే రక్షించేవాడే గాని, దోపిడీ చేసే వాడు కాదు అని నేను కర్నూలు సభలో చెప్పాను, ఆ తరువాత రోజు రెడ్డి కుల పెద్దలు వచ్చి చాలా మంచి మాట చెప్పారు అని నాతో అన్నారు.

మీ కత్తులకు, బాంబులకు,రౌడీ రాజకీయాలకు నేను భయపడను. -కడపలో జనసేన అధినేత శ్రీ

పవన్ కళ్యాణ్ పేరు చివరన కులం ఉండదు .అన్ని కులాలు నాకు సమానమే.

కడప నుండి చెప్తున్నా మీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొట్టి చూపిస్తా. -కడపలో జనసేన అధినేత శ్రీ

ప్రతిపక్షం గాని, అధికార పక్షం గాని అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యువత, మహిళలు మార్పు కోరుకుంటున్నారు.రోడ్డు మీదకి జనం వచ్చి జనసేన, జనసేన అని అంటున్నారు..మార్పుని కోరుకుంటున్నారు.

నిజంగా ప్రభుత్వం పనితీరు, ప్రతిపక్షం పనితీరు సరిగ్గా ఉండి ఉంటే ఈరోజు జనసేన అవసరం సమాజానికి అవసరం ఉండేది కాదు.

జగన్ మోహన్ రెడ్డి గారూ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి,మీరు ఎప్పుడూ చట్ట సభల్లో వీటి గురించి మాట్లాడలేదు.రాయలసీమ అనేది ఒక చదువుల సీమ, రౌడీల సీమ కాదు. రాయలసీమని బాగుపరచడానికి మీరు కష్టపడాలి జగన్ గారూ, మీరు ఎదగడానికి కాదు.

పెద్దలు సరిగ్గా రాజకీయం చేస్తే సరే, లేదంటే సల సల రక్తం మరుగుతున్న బాంబులాంటి యువతని రాజకీయాల్లోకి దింపుతా.

స్పెషల్ స్టేటస్ గురించి నేను మాట్లాడుతుంటే, జగన్ మోహన్ రెడ్డి గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, ఆయన చేసే వ్యక్తిగత విమర్శల వలన రాష్ట్రానికి ప్రయోజనాలు ఉంటాయా. -కడపలో జనసేన అధినేత శ్రీ

మాట మార్చే నాయకులు కాదు, మాట మీద నిలబడే నాయకులు రావాలి.

మీకు అండగా ఉండే వ్యక్తులు కావాలి, వాళ్ళు మీ ఇంట్లో వారే అయ్యుండాలి, అందుకే మీ నుండే నాయకులని తీసుకుంటున్నాను.

జనసైనికుల మీద దాడులు చేస్తే నేను చూస్తూ ఊరుకోను, నా కోపం, తెగింపు, పొగరు మీరు తట్టుకోలేరు ఖబడ్దార్.

ప్రభుత్వ ఖజానాని ప్రజలందరికీ సమానంగా పంచడం జనసేనతోనే సాధ్యం .

మన గురించి మాట్లాడుతున్నారు అంటే మన బలం గుర్తించారు అని అర్థం, మన మీద దాడి చేస్తున్నారు అంటే వాళ్ళు బలహీన పడుతున్నారు అని అర్థం.

నేను మత సహనాన్ని కోరుకుంటాను, మతాల ఐక్యతను కోరుకుంటాను, మన దేశం అనేక మతాల, సంస్కృతుల కలయిక, జనసేన వీటిన్నటికీ కట్టుబడి మీ అందరికీ అండగా ఉంటుంది, సర్వ మతాలు, సర్వ కులాలు బాగుండాలని కోరుకుంటుంది జనసేన. -కడపలో జనసేన అధినేత శ్రీ

మనం టీడీపీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాం అని ప్రతిపక్ష పార్టీ అబద్ధాలు చెప్తోంది, మేం వామ పక్షాలతో మాత్రమే కలిసి పోటీ చేస్తున్నాం, టీడీపీతో, వైసీపీతో కానీ కలిసే ప్రసక్తే లేదు,వీళ్లకు పల్లకీలు మోసింది చాలు,ఇంక ముగింపు పలుకుదాం.

కడప

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here