కైకలూరు నియోజకవర్గంలో ఊపందుకున్న జనసేన ఎన్నికల ప్రచారం

0
699

ఏలూరు పార్లమెంట్ పరిధిలోని కైకలూరు నియోజకవర్గంలో ఊపందుకున్న జనసేన ఎన్నికల ప్రచారం

జనసేనపార్టీ కైకలూరు నియోజకవర్గం అభ్యర్థి శ్రీ బీవీరావు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజలకు జనసేన మేనిఫెస్టో వివరిస్తూ ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా కులాలకు మతాలకు అతీతంగా హారతులిస్తూ బాణసంచాలతో స్వాగతం పలుకుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అంటే కైకలూరులో మేమంతా జనసేన అభ్యర్థికి ఓటేస్తామని స్వచ్ఛందంగా తమ మద్దతు తెలియజేస్తున్నారు ఏలూరు పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెంటపాటి పుల్లారావు గారికి, బి వి రావు గార్లకు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో జనసైనికులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిబద్ధతచాటుకున్నారు.

కైకలూరు నియోజకవర్గం
జనసేన అంచనాలకు అందకుండా అన్ని సర్వేలను తారుమారు చేయడం ఖాయం మన రాష్ట్ర రాజధాని అమరావతి కోట మీద జనసేన జెండా రెపరెపలాడటం ఖాయం.

కైకలూరు నియోజకవర్గం1
బహుజన్ సమాజ్ వాది పార్టీ కమ్యూనిస్టు పార్టీలు బలపరిచిన పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ధ్యేయంతో జనసైనికులు అంతా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకొల్లు మాజీసర్పంచి, జనసేన పార్టీ ఏలూరుపార్లమెంటు వర్కింగ్ కమిటీ సభ్యులు సిరిపురపురాజబాబు ప్రజలను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here