బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో సంవత్సరం లోపు మీకు తాగునీటి సమస్యను తీరుస్తాం

0
752
Pedana

ఇక్కడకు వచ్చిన అన్నదమ్ములకు, ఆడపడుచులకు పేరు పేరునా ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు – పెడన లో జనసేన ఎన్నికల శంఖారావం లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

నేను జనసేన పార్టీ పెట్టిన రోజున నా వెనుక ఎవరూ లేరు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి నా జనసైనికులని, ఎక్కడెక్కడో ఉన్న నా ఆడపడుచులను నమ్మి మార్పు కోసం వచ్చాను రాజకీయాల్లోకి – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

ఎంతసేపూ చంద్రబాబు, జగన్ లకే తెలుసా, మాకు తెలియదా రాజకీయం? ఈ ఎన్నికల్లో రాజకీయం అంటే ఏంటో చూపిస్తాం, ఈ రెండు పార్టీలను తరిమి కొడతాం – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి దమ్ము లేదు, వారికి తెగింపు లేదు, జగన్ అంటే భయం,ఇక వారు జగన్ మీద పోరాటం ఏం చేస్తారు, వారు ఈ రాష్ట్రానికి పరిపాలన ఏం ఇస్తారు – పెడన లో శ్రీ @PawanKalyan గారు. #JANASENARevolution2019

రాబోయే తరాలకు భరోసా ఒక్క జనసేన పార్టీ మాత్రమే, ఎందుకంటే ఈ రోజున నేను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసం, ఈ సాంప్రదాయ రాజకీయ నాయకుల్లా యువతను ఓట్లు కోసం వాడుకోను,మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి నేను వచ్చాను – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

మీరు బాగుండాలని, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, మీరు ఆనందంగా ఉండాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజా శ్రేయస్సే జనసేన లక్ష్యం – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

నేను రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిపోదామని రాలేదు, పార్టీ పెట్టగానే ఎన్నికల్లో గెలవాలని అనుకోలేదు, ఒక రైతు రాత్రికి రాత్రి పంట పండించలేడు, ఒక ఐఎఎస్ అధికారి ఒక్క రోజులో చదివి ఆ ఉద్యోగం సంపాదించలేడు,నేను కూడా అందుకే ఇన్ని సంవత్సరాలు ప్రజల కష్టాలు తెలుసుకున్నాను – జనసేనాధిపతి

ఎంతసేపూ కొన్ని కుటుంబాలు తప్ప, ఇంకెవరూ రాజకీయం చెయ్యకూడదు కొత్త వాళ్ళు విద్యావంతులు విలువలున్న వ్యక్తులు రాకూడదు అంటే ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది, అందుకే మన జనసేనతో ఆ విధానాలకు స్వస్తి పలుకుదాం, సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం – పెడన లో శ్రీ @PawanKalyan గారు

ఈ యువతరానికి ప్రతినిధిగా @JanaSenaParty ఉంది, మీ ఆశయాలు మీ ఆశలు మీ ఆకాంక్షలు అన్నీ ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజున జనసేన పార్టీ బలంగా పని చేస్తుంది – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

జనసేన ప్రభుత్వం రాగానే నాణ్యమైన విద్య, ఎలాంటి విద్య అంటే, సరైన ఉపాధి అవకాశాల కల్పన కోసం అవసరమైన అన్ని స్కిల్స్ నేర్పించగలిగే ఉచిత విద్యా విధానాన్ని జనసేన ప్రభుత్వంతో తీసుకొస్తాం – పెడన లో శ్రీ @PawanKalyan గారు

జనసేన ప్రభుత్వం రాగానే, ముఖ్యమంత్రిగా నేను మొదటి సంతకం పెట్టేది తన శ్రమను మనకిచ్చి తన సర్వస్వం కోల్పోతున్న రైతన్నకు వారి ఆఖరి వయసులో, వారికి భరోసాగా ప్రకటించిన రైతు పెన్షన్ పథకం మీద తొలి సంతకం పెడతాను – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

ప్రభుత్వం నుంచి, నాణ్యమైన రేషన్ సరుకులు అందక ఇబ్బందులు పడుతున్న మన ఆడపడుచులకు, కుటుంబ సంఖ్యను బట్టి 2500 నుంచి 3500 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే పథకం మీద రెండవ సంతకం పెడతాను మన జనసేన ప్రభుత్వం వస్తే – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

ఈ రోజున ఇంతమంది యువత జనసేన మీద ఆశలు పెట్టుకున్నారు, నిరుద్యోగం మీద మనం యుద్ధం ప్రకటిద్దాం, నిరుద్యోగం సమస్యను రూపుమాపుదాం మన జనసేన ప్రభుత్వంతో, మూడు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం మూడవ సంతకం పెడతాను – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో తాగునీటి సమస్య ఉంది, జనసేన ప్రభుత్వం తో సంవత్సరం లోపు మీకు తాగునీటి సమస్యను తీరుస్తాం – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

ఉప్పటేరు నుంచి నీరు, ఎత్తిపోతల పథకం ద్వారా, కృత్తివెన్ను మండలానికి సాగునీటి సౌకర్యాన్ని మన జనసేన ప్రభుత్వంతో ఒక సంవత్సర కాలంలో కల్పించి తీరుతాం – పెడన లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019

కాలుష్యం లేకుండా ఉండే ఆక్వా రంగం కార్పొరేషన్ ను, ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఏర్పాటు చెయ్యడానికి మన జనసేన ప్రభుత్వంతో కృషి చేస్తాం – పెడన లో శ్రీ @PawanKalyan గారు. #JANASENARevolution2019

మత్స్యకారులు వేటకు వెళ్లలేని సమయంలో,ప్రభుత్వం నుండి రోజుకు కనీసం ఐదు వందల రూపాయలు వచ్చేలా,అలాగే మీకోసం ఒక ప్రత్యేక బ్యాంకు స్థాపించి మీకు కావాల్సిన వలలు,ఇతర పరికరాలకు కావాల్సిన రుణాలు తక్కువ వడ్డీతో పొందేలా మన జనసేన ప్రభుత్వంతో చర్యలు తీసుకుంటాం అని మాటిస్తున్నా – పెడనలో జనసేనాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here