కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

0
852

కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు:

ఈరోజు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొణిదెల గ్రామం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ గారు కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాని, గ్రామ రూపురేఖలు మార్చి చూపిస్తానని చెప్పారు.

Janasena

పెద్దలు S.P.Y రెడ్డి లాంటి అనుభవజ్ఞులు మన జనసేనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు, అలాంటి వారి అండ ఉంటే 5 సంవత్సరాల్లోనే అద్భుతమైన అభివృద్ధి చేసి చూపిస్తాం…అని చెప్పారు.

నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రతీ మండలానికి ఒక డిగ్రీ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోగా ఏర్పాటు చేస్తాం.

యువ పారిశ్రామికవేత్తలకు వెంచర్ క్యాపిటల్ ఫండ్ క్రింద పెట్టుబడి ప్రోత్సాహం ఇచ్చి పరిశ్రమలు వచ్చేలా చేసి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం…

రాయలసీమ కరువుసీమ కాదు కల్పతరువు సీమ అని నిరూపించేందుకు జనసేనకు ఒక అవకాశం ఇస్తారని, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేలా అండగా నిలబడతారని కోరుకుంటున్నాను అని చెప్పారు.

చంద్రబాబు గారి కొడుకు భవిష్యత్తు కోసం, జగన్ గారి భవిష్యత్తు కోసం వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్నారు, నేను మన యువతరం భవిష్యత్తు తీర్చిదిద్దేదుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here