ఏలూరు-పార్లమెంటు అభ్యర్ధిగా డాక్టర్. పెంట‌పాటి పుల్లారావు

0
1062
Pentapati Pullarao

Jana Sena Party announced the candidature of economist Pentapati Pulla Rao for the Eluru Lok Sabha seat.

#కోట్లు ఉంటేనే #ఎమ్మెల్యే టిక్కెట్లు, #ఎంపీ టిక్కెట్లు ఇచ్చే పార్టీలు ఉన్న ఈ రోజుల్లో ప్రజలకు సేవ చేసే, ప్రజల సమస్యల పైన నిత్యం పోరాటం చేసే, ఎన్నడూ పేదల పట్ల నిలిచే ప్రముఖ #ఎకెనామిస్ట్#కాలమిస్ట్ శ్రీ పెంటపాటి పుల్లారావు గారు ఆయన ఒక ప్రాంతానికి పరిమితమై ప్రజల సమస్యల పైన పోరాటం చేయడం కాదు పార్లమెంటు కు వెళ్లి అక్కడ ప్రజల గొంతును బలంగా వినిపించాలని ఆయనకు #ఏలూరు పార్లమెంటు అభ్యర్థి గా ఎంపిక చేసిన #జనసేన అధినేత #పవన్_కళ్యాణ్ గారు.

పెంట‌పాటి పుల్లారావు

#ఏలూరు-పార్లమెంటు అభ్యర్ధిగా డాక్టర్. #పెంట‌పాటి పుల్లారావు గారిని ప్రకటించిన #పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ–>ప్ర‌ముఖ ఎకాన‌మిస్ట్‌, కాల‌మిస్ట్ డాక్ట‌ర్ శ్రీ పెంటపాటి పుల్లారావు గారు గిరిజ‌నుల స‌మ‌స్య‌ల పైనా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం చేసిన పోరాటాలు, బాధితుల‌కి అండ‌గా నిల‌బ‌డిన తీరు న‌న్ను ఆక‌ట్టుకున్నాయి…

ఆయ‌న సేవ‌లు దేశానికి చాలా అవ‌స‌రం..ఇలాంటి ఉన్న‌త‌మైన వ్య‌క్తులు పార్ల‌మెంటుకి వెళ్లాలి. రూ. 50 కోట్లు పెట్టి ఎంపీలు అయిపోదామ‌ని వ‌చ్చే వారు కాదు., విలువ‌ల‌తో కూడిన విజ‌యం సాధించిన వ్య‌క్తులు పార్ల‌మెంటుకి వెళ్లాల‌ని చిన్న‌నాటి నుంచి మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నాను..అలాంటి విలువ‌లు క‌లిగిన వ్య‌క్తి పుల్లారావు గారు…

సీనియ‌ర్ ఎకాన‌మిస్ట్‌గా పేరున్న ఆయ‌న చిన్న‌నాటి నుంచి విదేశాల్లో చ‌దువుకున్నా, దేశీయ సంస్కృతీ, క‌ట్టుబాట్లు, ఆచార వ్య‌వ‌హారాల మీద అపార‌మైన గౌర‌వం ఉన్న వ్య‌క్తి. ఆయ‌న రాసిన ఆర్టిక‌ల్స్ దేశ‌విదేశాల్లో ప్ర‌చురితం అవుతూ ఉంటాయి..ఇవ‌న్నీ
చాలా సంవ‌త్స‌రాల నుంచి నా దృష్టికి వ‌చ్చాయి…

అందుకే ముందుగా వారిని సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించాను..నా ఆహ్వానాన్ని మ‌న‌స్ఫూర్తిగా మ‌న్నించి పార్టీలో చేరినందుకు ముందుగా ధ‌న్య‌వాదాలు. ఇప్పుడు నా అభ్య‌ర్ధ‌న‌ను అర్ధం చేసుకుని జ‌న‌సేన పార్టీ త‌రుపున ఏలూరు లోక్‌స‌భా స్థానం నుంచి నిల‌బ‌డ‌డానికి అంగీక‌రించినందుకు మ‌రోసారి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెల‌పుతున్నాను…

పోల‌వ‌రం బాధితుల‌కి అండ‌గా నిల‌చిన మీ విజ‌యం పోల‌వ‌రం బాధితుల విజ‌యం, మీ విజ‌యం స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి విజ‌యం..మీలాంటి రాజ‌కీయ విలువ‌లు ఉన్న వ్య‌క్తులు పార్ల‌మెంటుకి వెళ్ళాలి…

శ్రీ #పుల్లారావు గారు మాట్లాడుతూ–>ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి రాజ‌కీయాల‌ని చూస్తున్నా, రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా అడుగులు ముందుకి వేసే ప్ర‌య‌త్నం చేసిన మొద‌టి పొలిటిక‌ల్ పార్టీ జ‌న‌సేన‌…2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లుతో పాటు, మిగిలిన రాజ‌కీయ పార్టీలకి భిన్నంగా ముందుకి వెళ్తున్నారు. ఇలాంటి విధానాలు మార్పుని తీసుకువ‌స్తాయి..అలాంటి పార్టీ నాలాంటి వ్య‌క్తికి పార్ల‌మెంటుకి పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌డం గొప్ప‌ విషయం..జ‌న‌సేన పార్టీ త‌ప్ప‌కుండా దేశ రాజ‌కీయాల్లో ఓ కొత్త పంథాని తీసుకువ‌స్తుంది…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here