జనసేన మేనిఫెస్టో ప్రకటించిన పవన్ కల్యాణ్

0
1231
janasena

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను విడుదల చేశారు. జనసేన ఆవిర్భావ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టో వెల్లడించారు. రైతులకు ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ఇస్తామన్నారు.

‘నా ప్రజలు పల్లకిలో కూర్చోవాలి అనుకున్నాను అది తప్పా!’ – @PawanKalyan

నా ప్రజలు

జనసేన మేనిఫెస్టో :

* రైతులకు ఎకరానికి రూ.8వేలు సాగు సాయం
* రైతు రక్షణ భరోసా కింద 60ఏళ్లు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.5వేలు పెన్షన్
* ప్రభుత్వ నిర్ణయాలతో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం 
* పరిశ్రమలకు భూములు ఇచ్చేవారికి అందులో భాగస్వామ్యం
* ప్రతి మండలంలో శీతల కేంద్రాలు
* ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్లు
* ప్రతి జిల్లాలో నదుల అనుసంధానం
* కొత్త రిజర్వాయర్ల నిర్మాణం
* 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
* డొక్కా సీతమ్మ క్యాంటీన్లు (విద్యార్థులకు ఉచితంగా తిండి)
* కులాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఫీజు చెల్లింపు
* చిరు వ్యాపారులకు రూ.5వేల రుణ సాయం(పావలా వడ్డీతో)
* ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు
* బీసీలకు 5శాతం రాజకీయ రిజర్వేషన్లు
* కాపులకు రిజర్వేషన్లు
* సామరస్యపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ
* అన్ని కులాలకు కలిపి హాస్టల్స్
* ఆరోగ్య రంగానికి బడ్జెట్ రెండింతలు
* సచార్ కమిటీ సిఫార్సులు అమలు
* విద్యార్థులకు ఉచిత భోజనం, రవాణ సౌకర్యం
* ఏడాదికి 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
* ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా
* ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రులు

జనసేన మేనిఫెస్టో

జనసేన మేనిఫెస్టో1

జనసేన మేనిఫెస్టో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here