జనసేనాని రాయలసీమ పర్యటన ఖరారు

0
991

జనసేనాని రాయలసీమ పర్యటన ఖరారు…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది.

పర్యటనలో ముందుగా కర్నూల్ జిల్లా లో 21, 22, 23వ తేదీల్లో జనసేనాని పర్యటించనున్నారు. కడప జిల్లాలో 25, 26, 27వ తేదీల్లోనూ చిత్తూరు జిల్లాలో 28, మార్చి 1, 2వ తేదీల్లో పర్యటించనున్నట్టు తెలిసింది. అయితే పర్యటన పూర్తి వివరాలను ఇంకా పార్టీ నేతలు వెల్లడించవలసి ఉంది. ఈ పర్యటనకు సంబంధించి నేతలకు, కార్యకర్తలకు అధినేత పవన్ కల్యాణ్ ముందగా దశాదిశా నిర్దేశం చేయనున్నారు.

జనసేనాని రాయలసీమ పర్యటన

పర్యటనలో భాగంగా కడప జిల్లాలోని యురేనియం మైన్స్, స్టీల్ ప్లాంట్ లను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారని తెలుస్తోంది. అలాగే కెసి కెనాల్ ను సందర్శించి ఆయుకట్టు రైతులతో ముఖాముఖీ నిర్వహించి పవన్.. వారి ఇబ్బందులను తెలుసుకుంటారు. సీమ సాగు జలాలపైనా రాయలసీమనకు చెందిన ముఖ్య నేతలతో పవన్ చర్చించి భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధానంగా రాయలసీమ జిల్లాల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతారని తెలుస్తోంది. మెనిపెస్టోకు అనుగుణంగా సీమ జిల్లాల ప్రధాన సమస్యలు చేర్చించే అవకాశం ఉన్నట్లు తెలసుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here