‘జనసేన’కు బయోడేటా అందజేసిన మాజీ భారత క్రికెటర్ వేణుగోపాలరావు

0
947
VenuGopal Rao

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చేయాలనుకున్న ఆశావహులు తమ బయోడేటాలను అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. విజయవాలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు 150 మంది ఆశావహులు తమ బయో డేటాలను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించారు. జనసేన అభ్యర్థిత్వం కోసం ఆశిస్తున్న యువ క్రికెట్ వేణుగోపాలరావు కూడా తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి అందజేశాడు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంకా తమకు బయోడేటాలు సమర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే రాపాపాక వరప్రసాద్, జనసేన నేతలలు సత్య బొలిశెట్టి, ముత్తం శెట్టి కృష్ణారావు, గిరజిన, ఎస్సీ హక్కుల కోసం పోరాడిన వారు, భూసేకరణ అమలులో లోపాలపై న్యాయపోరాటాలు చేసిన వారు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తరపున, ఆ ప్రాంతంలో ఎస్టీల పక్షాన నిలిచిన నాయకులు, రాయలసీమ ప్రాంతం నుంచి నలుగురు పాత్రికేయులు, పదవీ విరమణ పొందిన సైనికాధికారులు, సైనికులు, ముంబైలోని తాజ్ హోటల్ పై ఉగ్రదాడి జరిగినప్పుడు నిర్వహించిన ‘కమెండో ఆపరేషన్స్’లో పాల్గొన్న ఓ విశ్రాంత అధికారి తమ బయోడేటాలు సమర్పించినట్టు ‘జనసేన’ పేర్కొంది.

జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దరఖాస్తు చేసుకున్న
NSG commando
రవి కుమార్ గారు 👍👍🙏🙏
మాజీ సైనిక ఉద్యోగి భరతమాత కోసం ప్రాణాలొడ్డి ముంబై తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రవాద దాడి తిప్పికొట్టిన బృందంలో పని చేసిన వ్యక్తి
#రాజమహేంద్రవరం అర్బన్ కి దరఖాస్తు

NSG commando

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here