ఈ నెల 15న ధవళేశ్వరం బ్రిడ్జిపై జనసేన కవాతు దద్దరిల్లిపోవాలి

0
1408
Janasenakavathu

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి పోరాట యాత్ర తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 15న ధవళేశ్వరం బ్రిడ్జిపై జనసేన వేలాదిమంది జన సైనికులతో కవాతు నిర్వహించాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు.

 

ఈ మేరకు తగిన ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులను శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు.  ఇందుకు అనుగుణంగా పార్టీ నేతలు జంగారెడ్డిగూడెంలో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 9వ తేదీతో పశ్చిమలో యాత్ర ముగుస్తుంది.

9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి వేలాదిమంది జన సైనికులతో కలసి శ్రీ పవన్ కల్యాణ్ గారు కొవ్వూరు నుంచి రాజమండ్రికి కవాతు చేస్తారు. రాజ‌మండ్రి బ్రిడ్జి క‌వాతుని విజ‌య‌వంతం చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.

JANASENA NIRASANA KAVATHU kovvur to Rajahmundry

క‌వాతుకి ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి వేలాదిగా శ్రేణులు తరలి వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున త‌గిన ఏర్పాట్లు చేసే ప‌నిలో నిమ‌గ్నమ‌య్యారు. ఇందుకోసం వివిధ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క‌వాతుని విజ‌య‌వంతం చేయ‌వ‌ల‌సిందిగా పార్టీ శ్రేణుల‌కి జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here