రీకాల్ చట్టం కోసం జనసేన కృషి -జవాబుదారీతనం కోసం

0
1322
pawan-kalyan

రీకాల్ చట్టం కోసం జనసేన కృషి, విజయవాడలో జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం ఉండాలని పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలని పేర్కొన్నారు. దీనికోసం పలు ప్రజాస్వామ్య దేశాలలో అమలులో ఉన్న రీకాల్ చట్టం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Pawan Kalyan

రీకాల్ అనగానేమి 

ఆ దేశంలో ఒక్కసారి ఎన్నికైతే పదవి ఐదేళ్లపాటు గ్యారెంటీ అనే పద్ధతి ఉంది .
దీనిని అండగా చేసుకుని ప్రజా ప్రతినిధులు ఐదేళ్లపాటు ఏమి చేసినా చేసినా సరే హద్దు అదుపు ఉండదనేది ధీమా ఏర్పడింది.దీనికి చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో రీకాల్ చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు.ఈ చట్టం ప్రకారం ఒక ప్రజా ప్రతినిధి
అవినీతికి పాల్పడినా
దౌర్జన్యానికి పాల్పడిన
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి మారినా, సరిగా పనిచేయక పోయినా మేనిఫెస్టో హామీలు అమలు చేయకపోయినా

ఐదేళ్ళపాటు నిరీక్షించకుండా ప్రజలే తక్షణం పదవి నుంచి తొలగించటం రీకాల్ చట్టం.

ఈ చట్టం వస్తే మేనిఫెస్టోలో కల్లబొల్లి మాటలు చెప్పే అవకాశం ఉండదు

ఈ చట్టం వస్తే వనజాక్షి పై వృద్ధులపై దౌర్జన్యాలు చేసే ఆకు రౌడీలు ఉండరు , దోపిడీలు దౌర్జన్యాలు ఉండవు అవినీతి ఉండదు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడానికి కుదరదు మేనిఫెస్టో లో అమలుకు అసాధ్యమైన అంశాలు మాత్రమే పెడతారు.

స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి పూనుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు సాధించే క్రమంలో విజయవంతమవ్వాలని స్వచ్ఛమైన పాలన దిశగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరుకుంటున్నాను  – Desamkosam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here