జనసేనానికి పశ్చిమవాసుల ఘనస్వాగతం

0
1107
జనసేనాని

జనసేనానికి పశ్చిమవాసుల ఘనస్వాగతం

ప్రజా సమస్యలపై జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన పోరాటయాత్ర కొన్ని రోజుల క్రితం ఉత్తరాంధ్రలో ముగిసింది. ఉత్తరాంధ్రలో ప్రజల సమస్యలను స్వయముగా తెలుసుకున్న జనసేనాని అనంతరం కంటి వైద్యం నిమిత్తం పోరాట యాత్రకు కాస్త విరామం ప్రకిటించారు.

అనంతరం హైదరాబాద్ మరియు విజయవాడలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన జనసేనాని తిరిగి పోరాట యాత్రను సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి నుండి ప్రారంభించడానికి  సిద్దమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం విజయవాడ నుండి బయల్దేరి హనుమాన్ జంక్షన్, ఉండి మీదుగా సోమవారం రాత్రికి భీమవరం చేరుకున్నారు. జనసేనుడు వస్తున్నాడని తెలుసుకున్న పశ్చిమవాసులు దారి పొడవునా నీరాజనాలు పలికారు. పూల వర్షం కురిపించారు.

భీమవరం పట్టణం పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంద్రంగా మారింది. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తమ పట్టణం వస్తున్నారని తెలుసుకున్న భీమవరం వాసులు ఆదివారం ఉదయం నుండే ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. భీమవరంతో పాటు పాలకొల్లు, ఉండి, ఆకివీడు నర్సాపురం తదితర పట్టణాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలతో భీమవరం కిక్కిరిసిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here