గంగవరం పోర్టు బాధితులకు అండగా ఉంటా – PawanKalyan

0
1102
Janasena Cheif Pawan Kalayan

PUBLIC

గంగవరం పోర్టు బాధితులకు అండగా ఉంటా – @PawanKalyan

Friday, May 18, 2018 7:40 PM

ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గంగవరం గ్రామాన్నిసందర్చశించారు అక్కడ కాలుష్యంతో బాధ పడుతున్నఆ గ్రామ ప్రజలను కలిశారు.అక్కడున్నసమస్యలని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రజలతో జనసేనాని మాట్లాడుతూ..

గంగవరం పోర్టు నుంచి వస్తున్న కాలుష్యం ప్రజలకు చాలా ఇబ్బంది కలుగచేస్తుంది, ఆరోగ్యాలు పోతున్నాయి  అలానే పోర్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏమైతే  ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసారో అవి ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చింది మన జనసేన పార్టీ జనసైనికులు అలానే గ్రామ పరిరక్షణకు పాటుపడుతున్న గ్రామ స్థాయి నాయకులు, వీరందరికి అండగా జనసేన ఉంటుంది. నేను పోయిన సారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్పాను. ఒక వేళ వాళ్ళు పనులు చెయ్యని పక్షంలో, నేను మళ్లీ మీ ముందుకు వచ్చి వారిని నిలదీస్తా అని చెప్పా, అదే పరిస్థితిలో ఈరోజు మీ ముందుకు వచ్చా. ప్రజలు అవకాశం ఇస్తే బాధ్యతో కూడిన ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచెయ్యాలే గాని వారి కుటుంబాల కోసమో, వారి శాసన సభ్యుల కోసమో, వారి బంధువర్గం కోసమో కాదు, మనందరి కోసం ప్రభుత్వాలు పనిచేయాలి అని హెచ్చరించారు జనసేనాని.  ప్రజా సమస్యలను అన్ని పార్టీలు మర్చిపోయాయేమో గానీ జనసేన పార్టీ  మాత్రం మర్చిపోదు. పవన్ కళ్యాణ్ మర్చిపోడు  అని అన్నారు. ఈ గంగవరం కాలుష్యం సమస్య పరిష్కారం అయ్యే వరుకు మీకు నేను అండగా ఉంటానని అన్నారు. ఈ గంగవరం కాలుష్యం సమస్యపై పోరాటం చెయ్యడానికి…శేషు, నూకరాజు, ముసలయ్య వీరి ఆధ్వర్యంలో ప్రజల సహాయ సహకారాలతోటి, గ్రామ పెద్దల సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేలా పోరాడుతామని 2019 ఎన్నికల్లో మీకు న్యాయం చేసే పార్టీనే మీరు ఎన్నుకోండి అది జనసేన అనిపిస్తే జనసేనకు ఓటు వెయ్యండి  అని చెప్పారు. నేను బాధ్యతల నుండి పారిపోను, జనసేన పార్టీ బాధ్యతల నుంచి పారిపోదు, నిలబడుతాం ! నిలదీస్తాం !! అన్నారు. ప్రభుత్వం రీహాబిలిటేషన్, రిలోకేషన్ చేసే వరుకు మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, పోరాడుతుంది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీరు ప్రేమతో నా దగ్గరకు వస్తున్నారు, ప్రేమతో నాకు దీవెనలు ఇస్తున్నారు, నేను మీకోసం నిలబడకపోతే ఇంకెవరి కోసం నిలబడతా! మీ నినాదాలు ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి అండగా నిలబడే విధంగా ఉంటేనే విలువ. సగటు మనిషి తాలూకు బాధని తీరుస్తేనే ఆ నినాదాలకు విలువ. ఎన్నికల సమయంలో వస్తారు, ఓట్లు అడుగుతారు, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్తారు. సమస్య వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒక సాకు చెప్తారే గానీ,  నేను మీకు మాట ఇచ్చాను నెరవేర్చాలి అని మాత్రం ఎవరు చెప్పరు. మీకు ఎమ్మెల్యేలు ఏమైతే మాట ఇచ్చారో, ఆ మాట తప్పిన పక్షంలో గ్రామాలలోకి వారిని రానివ్వకండి! అడగండి!! నిలదియ్యండి అని గంగవరం గ్రామ ప్రజలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here