మాపై నిజమైన ప్రేమ ఉన్నది పవన్ ఒక్కడికే

0
895
పవన్
ఆయన్ను నమ్ముతున్నామంటున్న గిరిజన యువతీ యువకులు అభ్యర్ధిత్వాన్ని కోరుతూ గిరిజనుల నుంచి గణనీయంగా దరఖాస్తులు
స్క్రీనింగ్ క‌మిటీకి బ‌యోడేటా సమర్పించిన రావెల కిషోర్ బాబు సోమ‌వారం ఒక్క రోజే 275 ద‌ర‌ఖాస్తులు.

విజయవాడ: 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా ప‌త్తిపాడు నుంచి జ‌న‌సేన అభ్య‌ర్ధిత్వం కోరుతూ మాజీ మంత్రి, జ‌న‌సేన నాయ‌కుడు రావెల కిశోర్ బాబు స్క్రీనింగ్ క‌మిటీకి బ‌యోడేటాను స‌మర్పించారు. పార్టీ నిర్దేశించిన న‌మూనాను పూర్తి చేసి సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని రాష్ట్ర కార్యాల‌యంలో క‌మిటీ స‌భ్యుల‌కు అంద‌జేశారు. త‌మ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చూపించిన దారిలోనే తాము కూడా స్క్రీనింగ్ క‌మిటీకి బ‌యోడేటాను స‌మ‌ర్పించామ‌ని, ఆశావ‌హులు ప్ర‌తి ఒక్కరూ స్క్రీనింగ్ క‌మిటీకే బ‌యోడేటా స‌మ‌ర్పించాల‌నీ తెలిపారు. విశ్రాంత ఐ.పీ.ఎస్. అధికారి టి.రవికుమార్ మూర్తి బయో డేటా అందజేశారు. సోమ‌వారం ఒక్క రోజే 275 బ‌యోడేటాలు స్ర్కీనింగ్ క‌మిటీ ముందుకు వ‌చ్చాయి. బ‌యోడేటాలు స‌మ‌ర్పించిన వారిలో విశ్రాంత ఉద్యోగులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు, గిరిజ‌నులు ఎక్కువ‌గా ఉన్నారు. క‌మిటీ స‌భ్యులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఒక్కొక్క ద‌ర‌ఖాస్తును నిశితంగా ప‌రిశీలించారు.
అభ్యర్ధిత్వానికి ఉత్సాహం చూపిన గిరిజ‌నులు

అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ వ‌చ్చిన ఆశావ‌హుల్లో గిరిజ‌న యువతీ యువకులు గణనీయంగా ఉన్నారు. గిరిజ‌న సంక్షేమానికి జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని, అధికారంలోకి వ‌స్తే బాక్సైట్ త‌వ్వకాలు నిలిపివేస్తామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించ‌డం, పోరాట‌యాత్ర‌లో భాగంగా అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి… గిరిజనులతో మమేకమైన విధానం తమను ఈ పార్టీ వైపు నడిపించాయని వారు తెలిపారు. గిరిజనులపై నిజమైన ప్రేమ ఉన్నది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మాత్రమే అని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలకు సరైన పరిష్కారం జనసేన పాలనలో లభిస్తుందని చెప్పారు. ఈ ఐదు రోజుల్లో స్క్రీనింగ్ క‌మిటీ ముందుకు పలువురు అడ‌విబిడ్డ‌లు త‌ర‌లి వ‌చ్చి రిజ‌ర్వ్డ్ స్థానాల్లో త‌మ అభ్య‌ర్ధిత్వాన్ని ప‌రిశీలించాల్సిందిగా కోరారు. సోమ‌వారం ఒక్క రోజే 45బ‌యో డేటాలు గిరిపుత్రుల నుంచి వ‌చ్చాయి. వీరిలో ఎక్కువ మంది పీజీ, వృత్తి విద్యలు అభ్యసించినవారు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here