పోరాడే దుర్గాదేవిలా, చదువు చెప్పే సరస్వతిలా..మహిళలు ఉండాలి – జనసేన

0
1879
JanaSena veera mahila

వీరమహిళలతో జరిగిన సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం : 

* సమాజంలో జరుగుతున్న అన్యాయం, స్త్రీ తాలూకు భద్రత మొదలుగునవి నన్ను ఇంత చిన్న వయస్సులో పార్టీ పెట్టడానికి ప్రభావితం చేశాయి.

* ఇంట్లో నుండి ఆడపిల్ల బయటకు వెళ్తే భద్రతగా తిరిగొచ్చే పరిస్థితి లేదు. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటి సంఘటనలు చూసాను.

* వనరులు పెరగవు. వున్న వనరులను ఎంత ఎక్కువ శాతం వినియోగించుకోగలమో అదే ఆర్ధిక శాస్త్రం. ఇది తల్లి దగ్గర నుండి నేర్చుకోవొచ్చు. ఒక మహిళ ఇల్లు నడిపే విధానం, వంట గదిని నడిపే విధానం చూస్తే మనకి వారి గొప్పతనం అర్ధమవుతుంది.

* మహిళలు తాలూకు సాధికారిత కావాలంటే సొసైటీ సపోర్ట్ చెయ్యాలి. పొలిటికల్ సిస్టమ్ ద్వారా సొసైటీ మద్దతు తెలపాలి.

* ప్రతీ మహిళలో నిగూఢమైన, చాలా బలమైన శక్తి ఉంటుంది. ఆ పరిస్థితులు కల్పించే వరకూ మనకి అది తెలీదు. పోలాండ్ నుండి వచ్చిన విద్యార్థులు నువ్వు మహిళలకు ఎం చేయగలవు అని అడిగారు. మనం ఎం చేయనవసరం లేదు, వారి దారిలోకి ఎవరూ వెళ్లకుండా ఉంటే చాలు అని నేను వాళ్లకి చెప్పా..

* మగాళ్ళకి మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉండదు. ఆడవాళ్ళకి మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉంటుంది. కొన్ని కుటుంబాలు మహిళలకు ఇచ్చే భద్రత సమాజం అంతా సంపూర్ణంగా మహిళలకు ఇస్తే తప్ప, మహిళా సాధికారిత రాదు.

* మహిళలకు సాధికారత కల్పించాలంటే ముందుగా వారికి భద్రత కల్పించాలి. వారిలో ఏదొక భయం ఉంటుంది. మహిళలు సమస్యల మీద ప్రణాళికా బద్దంగా చేస్తే మిగతావారు భయపడతారు.

* ఈ దేశం ఆరాదించేది స్త్రీ శక్తిని. మహిళలలో అపారమైన శక్తిని నేను చూసా…అందుకే నేను వీరమహిళ అని పేరు పెట్టా…నేను ఏమి చేసినా నాకు చిన్నప్పటి నుండి ఆడపడుచుల ఆశీస్సులు వున్నాయి.

* కొంత మంది మహిళలను తప్పటి ఉదాహరణగా తీసుకుని అందరికీ అది వర్తింపజేస్తే నాకు నచ్చదు. సమాజంలో అందరూ ఒకేలా వుండరు.

* నేను చాలా గొప్ప ఆశయంతో, చాలా బలమైన సంకల్పంతో జనసేన పార్టీని పెట్టా…లక్ష్యం ఛేదించాలి, సాధించాలి అంటే విపరీతమైన సహనం కావాలి, అది మీ దగ్గర ఉంటుంది.

* ప్రతివారూ కొంచెం త్యాగం చేయాలి… నా వరకు నేను నా పిల్లలకు, కుటుంబానికి ఇచ్చే సమయాన్ని కూడా తగ్గించేసి వచ్చా.

* మహిళలు నన్ను ఒక అన్నయ్య లాగా అనుకొని వారి బాధలు అన్ని నాకు చెప్పుకుంటారు. ఇక్కడ మహిళలు, పురుషులు అనే భేదం ఏమి లేదు, పని చేసే విధానం వేరుగా ఉండొచ్చు.

* మహిళలకు కొంచెం కోపం ఉంటుంది. కానీ మన రాజకీయాల్లో సహనం అవసరం, కాబట్టి సహనంతో లక్ష్య సాధన వైపు పనిచేయండి.

* మహిళలు గట్టిగా మాట్లాడగలగాలి, అలా అని రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు, చదువు కంటే జ్ఞానం తో మాట్లాడగలిగే వారు, అందరిని కలుపుకుంటూ, గొడవలు తట్టుకుంటూ ముందుకెళ్లే మహిళలు కావాలి.

* మహిళలు చదువు చెప్పే సరస్వతి లా, పోరాడే దుర్గాదేవి లా ఉండాలి..

* చాలా మంది నేను అందరిని కొడతాను అని అంటారు, నిజమే మహిళలపై జరిగే వేధింపులు చూడలేక ఆపటానికే కొట్టేవాడిని.

* మహిళల వస్త్రధారణ బట్టి వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయించకూడదు, అది వారి వ్యక్తిగత అభిరుచి, దానికి వారి వ్యక్తిత్వానికి సంబంధం లేదు.

* జనసేన సిద్ధాంతాలు బలమైనవి, మహిళలకు భద్రత కల్పించే విధానంతో జనసేన పనిచేస్తుంది.

* అరుపులు,కేకలతో ఉండే మహిళలు నాకు వద్దు, విజ్ఞతతో.. వివేకంతో మాట్లాడే మహిళలు మన పార్టీకి కావాలి, కాబట్టి మీరు కలుపుకుకొని వెళ్లే విధానంతో పనిచేయండి.

* మీరు గంట సమయం ఇచ్చినా పర్లేదు. కానీ ఆ ఒక్క గంట మనసుపెట్టి ప్రభావితం చేసేవిధంగా పనిచేయండి.

* టీడీపీ, వైస్సార్సీపీ పార్టీలలో ఏం భావజాలం ఉంది? ఒకరేమో మళ్ళీ నన్నే ముఖ్యమంత్రి చేయండి నేను అది చేస్తాను అంటారు, ఇంకొకరు నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను చేస్తాను అని అంటారు తప్ప మనలాగా ఏ భావజాలం లేదు.

* జనాలకి నా వీడియోలు, నా ప్రసంగాలను చూపించండి. నేను ఎప్పుడు ఒకేలా ఉన్నానా లేదా అనేది మీరు అర్ధం చేసుకుని వారికి అర్ధమయ్యేలా చెప్పండి…

* నేను నా వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని విధాలుగా మాట్లాడినా నేను మాట్లాడను. నేను ఏంటో నాకు తెలుసు, నా ఇంటి విషయాలను రోడ్ల మీదకు తీసుకురాను.

* ముఖ్యమంత్రి గారు సింగపూర్ తరహా అని అంటారు, వారి పార్టీ ఎమ్మెల్యే లాగా ఒక అధికారి మీద చేయి చేసుకుంటే సింగపూర్ లో 5 ఏళ్ల వరకు జైలులో వేస్తారు మరి ఇక్కడ అలా చేయగలిగారా!!!

* రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు, యధా రాజా తదా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే రేపటి రోజు మహిళలపై దాడులు పెరిగే అవకాశం ఉంటుంది .

* ముందు మీ మహిళా విభాగం మీలో మీరు ఒకరినొకరు అర్ధం చేసుకోండి, గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోండి కానీ గ్రూప్స్ కట్టకుండా సమిష్టిగా పని చేయండి.

* మీ విభాగంలో కూడా యువతను విద్యార్థి విభాగం , వేరు వేరు విభాగాలుగా  విభజించి మహిళలకు కావలసిన వాటిని మీరే అర్ధం చేసుకుని వారం వారం మీటింగ్స్ లో చర్చించి నిర్ణయాలను నాకు తెలియచేయండి.

* అరకులో ఒక పాఠశాలకు వెళ్ళాను అక్కడ చిన్నపిల్లలు కూడా అన్నయ్య నాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకుంటున్నారు అది వారికి మన పట్ల ఉన్న నమ్మకం.

* మీరు కూడా ఇష్టంతో మీరు చేయగలిగినంత వరకు మాత్రమే చేయండి, ఎక్కువ బరువులు తీసుకోవద్దు. సంతోషంగా చేయగలిగినంత వరకు చేయండి, పాలసీలు చేసే విధానం ఉన్నవారు ముందుకు వచ్చి మాట్లాడండి.

* ఆడపిల్ల భద్రత చాలా ముఖ్యం, దానికోసం బలమైన వ్యవస్థ కావాలి.. ఎలా ఉండాలంటే రేపటి రోజున వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ వ్యవస్థ మార్చాలంటే బయపడాలి.

* గాంధీ గారు చెప్పినట్లు ముందుగా వెటకారం చేస్తారు కానీ ఏదో ఒకరోజు విమర్శించిన వారందరు కూడా అర్థం చేసుకొని మనతో నిలబడతారు.

* నెల్సన్ మండేలా లాంటి మహానుభావుడు కూడా 28 ఏళ్ళు జైలులో కూర్చొన్న తరువాత ఆయనను గుర్తించారు. అలాగే మనం ఇలాంటి చిన్న చిన్న విమర్శలకు బయపడితే ఎలా? సహనం కావాలి, మన ఆశయం, సంకల్పం దిశగా పనిచేయాలి.

* మమతా బెనర్జీ, జయలలిత లాంటి వారిని కూడా ఒకప్పుడు రోడ్లమీదకు లాగి హింసించారు, కానీ వారు తరవాత ఏ స్థాయికి వెళ్లారు. అలా మనం అర్థం చేసుకొని ముందుకెళ్లాలి కాని అక్కడే ఆగిపోకూడదు.

* నేను మగవారికి చెప్పినట్లుగా మీకు రోడ్ల మీదక్ వెళ్లి అది చేయి, ఇది చేయి అని చెప్పను, మీరు నా అక్కచెల్లెళ్ళు. మీకు గౌరవం కల్పించే దిశగా మీతో పనిచేయించుకోవాలి అనుకుంటాను.

* నేను దశాబ్దపు కాలం ఓటమిని చూసి వచ్చిన వ్యక్తిని, ఒక్కరోజులో మార్పు అవ్వదు, మనందరం ఓపికతో పని చేయాలి. వ్యక్తిగత ఫలితాన్ని ఆశించి కాకుండా సామాజిక మార్పు కోసం పనిచేయాలి.

* శిల్పి, రాయిలో అనవసర భాగాలు తీసేసి ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా.. మనలోని చెడును తీసేసి మంచి విధానంతో ముందుకు వెళ్ళాలి…

* నేను సినిమా ప్రపంచంలోంచి వచ్చినవాడిని, అవే నన్ను రాజకీయాల్లోకి రాకుండా ఆపలేకపోయాయి, కాబట్టి మీరు విమర్శలకు బయపడకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here