తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం

0
803
Pawan Kalyan Janasena
 • నేను ప్రాంతాలు ఏవైనా సరే ప్రజల కష్టాలు చూసి చలించిపోయే గుణం తెలంగాణ నేల ఇచ్చింది – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.

బహు జనసేన యుద్ధభేరి

 • కేసీఆర్ గారి పాలనపై నేను అడ్డగోలుగా మాటలు మాట్లాడను కాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం లేకుండా చంపేయటం మాత్రం నేను సపోర్ట్ చేయను, ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ @PawanKalyan గారు.
 • 2014 లో ఇదే స్టేడియంలో మోడీ గారితో కలిసిసభలో పాల్గొన్నప్పుడు ఒక్కటే అడిగాను ఇరు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయమని అడిగాను, ఆరోజు మోడీ గారిలో నాయకుడిని చూసాను, కానీ ఆయన రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • తెలంగాణకు కావలసింది యువనాయకత్వం, సరికొత్త నాయకులు, ఉస్మానియా విద్యార్థుల నుండి నాయకత్వం రావాలి, అలాంటి నాయకత్వాన్ని నేను జనసేన ద్వారా తీసుకొస్తాను – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • కేసీఆర్ గారు మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే తప్పు చేసిన చంద్రబాబు గారికి మీరు వ్యక్తిగతంగా ఇచ్చుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • నాకు రాజకీయ చైతన్యం నేర్పించింది తెలంగాణ నేల, నాకు నెల్లూరులో ఉన్నప్పుడు సాయుధ పోరాటం చేయాలని ప్రేరేపించింది తెలంగాణ సాయుధ పోరాటం – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • తెలంగాణ గురించి నీకేం తెలుసు అని అడిగితే, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇక్కడి ప్రజలకు ఎంత తెలుసో అంతకు మించి నాకు తెలుసు, తెలంగాణ ప్రజల కన్నీళ్లు నాకు తెలుసు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • మాస్టర్ జీ తెలంగాణ ఆడపడుచు కష్టాల గురించి పాట రాస్తే నేను కన్నీళ్లు పెట్టుకున్నాను, ఆరోజు నాటికి కేసీఆర్ గారు ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టలేదు, అంతటి అనుబంధం నాకు తెలంగాణ తో ఉంది – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • 2009 లో ప్రజారాజ్యం ద్వారా సామాజిక న్యాయం అనే అంశాన్ని ముందుకు తీసుకురావటికి కారణం ఉస్మానియా విద్యార్థులు, ఉస్మానియా ప్రొఫెసర్లు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • ఒక పార్టీ పెట్టి నడపాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో వ్యక్తిగత దాడులు అయినా సరే నేను ప్రజల కోసం పోరాడేందుకు రాజకీయ పార్టీ పెట్టాను – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalya గారు.
 • కాన్షీరాం గారి ద్వారా నేను రాజకీయాలకు డబ్బు అవసరం లేదు కేవలం ప్రజల కోసం పనిచేయగలిగే చిత్తశుద్ధి ఉంటే చాలు అని అర్థం చేసుకున్నాను – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజా గాయకుడు గద్దర్ గారికి ఒక్కటే చెప్పాను, ఆంధ్రా పాలకులు వేరు, ఆంధ్రా ప్రజలు వేరు అని, ఆంధ్రా నాయకులు చేసిన తప్పులకు ఆంధ్రా ప్రజలను తప్పు పట్టడం సరికాదు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • బహు జనసేన యుద్ధభేరి2
 • మాయావతి గారు ఏమీ కవిత గారిలా ముఖ్యమంత్రి గారి కూతురు కాదు, కానీ కాన్షిరాం గారి ఆశయాలను సాధించేందుకు ఒక్కరే కష్టపడి ఒకసారి కాదు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, అంతటి హోప్ప పోరాట యోధురాలు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • తెలంగాణ వచ్చినందుకు ముందుగా సంతోషించేవాడిని నేనే, కానీ ఆంధ్రా ప్రజలను తప్పు పడితే సహించే వాడిని కాదు, తప్పులు చేసింది ఆంధ్రా పాలకులు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తా అని KCR గారు చేయలేకపోయారు,అప్పటి ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకోగలను, KCR గారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన వ్యక్తిగా గౌరవిస్తాను – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • దళితులను తెలంగాణ ముఖ్యమంత్రి గా చేయలేకపోయాము కానీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా చేయాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాను – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • కేసీఆర్ గారు ఆయనను నా ముందే అడ్డగోలుగా తిట్టిన తలసాని గారిని, ఎర్రబెల్లి గారిని, మరెంతో మంది నాయకులను తన పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇస్తే ఇక మీరు చెప్పే మాటలు అర్థం ఏముంది – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • బహు జనసేన యుద్ధభేరి3
 • ఎంతసేపు తలసాని గారు, వారి కుమారులు, సబితా ఇంద్రారెడ్డి గారి లాంటి వారిని తీసుకు వస్తే ఇక సరికొత్త తెలంగాణ ఎలా సాధ్యం, మళ్లీ పాత తెలంగాణ వస్తుంది – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • కేసీఆర్ గారు ఎంతసేపు తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వారిని, వారి కుమారులను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇస్తే బంగారు తెలంగాణ ఎలా వస్తుంది – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • కేసీఆర్ గారు మీరు కూడా మరోసారి మీ రాజకీయ పొత్తులపై పునఃసమీక్షించుకోవలసిన అవసరం ఉంది, దయచేసి ఉద్యమాన్ని అగౌరవ పరచిన వ్యక్తుల నుంచి బయటకు రండి, సరికొత్త తెలంగాణ నిర్మిద్దాం – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • మార్పు కోసం ఎవరో ఒకరు అడుగేయాలి, లేకపోతే మార్పు ఎప్పటికి రాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవస్థకు జనసేన తరపున నూతన నాయకత్వాన్ని మీ ముందు నిలబెడుతున్నాను, వారిని మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • జనసేన, BSP కూటమి నుంచి 12 మంది ఎంపీ అభ్యర్థులను మీ ముందు నిలబెడుతున్నాను, వారు ఎవరూ కూడా ఏ ముఖ్యమంత్రి కోడుకులు కాదు, మీలోంచి వచ్చిన నాయకులు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • లక్ష ఉద్యోగాలు ఇంకా రాలేదని విద్యార్థులకు , తెలంగాణ యువతకు ఆవేదన ఉంది, మనం సాధించేందుకు ప్రయత్నిద్దాం, ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళదాం – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • జనసేన ద్వారా ఉస్మానియా నుంచి సరికొత్త యువ నాయకులను తీసుకొచ్చి సరికొత్త తెలంగాణ ను నిర్మిద్దాం – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • వైఎస్ గారు బ్రతికున్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అణగద్రొక్కారు, వారి కుమారుడు జగన్ గారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మహబూబాబాద్ దగ్గర రాళ్లు వేసి తరిమేశారు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • జగన్ గారు మన యాదగిరి గుట్ట దేవాలయంలో చెప్పులు వేసుకొని ప్రవేశిస్తే మీరు ఒప్పుకుంటారా, మరి తిరుమల దేవాలయంలో సంప్రదాయాలు పాటించకుండా ప్రవేశించిన వ్యక్తిని ఎలా సమర్ధిస్తారు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • కేసీఆర్ గారు మన రెండు రాష్ట్రాలు విడిపోయాయి, ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు చేసిన తప్పుకు మీరు ఆంధ్రా ప్రజల మీద పగ సాధించాలనుకోవడం సారి కాదు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • ఒక అవినీతి పరుడిని, జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ లో మీరు సపోర్ట్ చేయడం న్యాయమా? తెలంగాణకు అవసరం లేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఎందుకు, అంత పాపం ఆంధ్రా ప్రజలు ఏం చేశారు – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • కేసీఆర్ గారు మీకు నిజంగా ఆంధ్రా రాజకీయాల్లో ఉండాలనుకుంటే మీరు టిఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టండి మేము స్వాగతిస్తాం అంతేకాని వైసీపీ కి మద్దతు ఇచ్చి రాష్ట్రానికి అన్యాయం చేయకండి – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.
 • ఒక చాయ్ వాలా దేశానికి ప్రధాని కాగలిగినప్పుడు చాయ్ గ్లాస్ గుర్తుతో ముందుకు వస్తున్న జనసేన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపిస్తుంది, తెలంగాణలో జెండా ఎగరేస్తుంది – తెలంగాణ బహు జనసేన యుద్ధభేరిలో శ్రీ PawanKalyan గారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here