జనసేనకు మైనారిటీలు జయహో!!

0
1162
  • అభ్యర్థిత్వం కోసం బయో డేటాల సమర్పణ
  • క్యూలోనే వచ్చిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

Sachar Committee

విజయవాడ: జనసేన పార్టీ చెప్పిన ఏడు బలమైన సిద్ధాంతాలు విద్యావంతులను అమితంగా ఆలోచింపచేసి పవన్ కల్యాణ్ బాటలో నడిపిస్తున్నాయి. ముస్లింలుఇతర మైనారిటీలను మత ప్రస్తావన లేని రాజకీయం అనే సిద్ధాంతం ఆకట్టుకుంటోంది. వారిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొస్తోంది. జనసేన అభ్యర్థిత్వాన్ని కోరుతూ పలువురు ముస్లింలుక్రైస్తవులు బయో డేటాలు ఇస్తున్నారు. గురువారం స్క్రీనింగ్ కమిటీ ముందుకు 150 బయో డేటాలు వచ్చాయి. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిత్వాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ బయో డేటా సమర్పించారు. జనసేన నేతలు సి.పార్థసారథిఅద్దేపల్లి శ్రీధర్ బయో డేటాలు ఇచ్చారు. అలాగే గుంటూరు నుంచి వైద్యులైన ముస్లిం దంపతులు బయో డేటా ఇచ్చి అభ్యర్థిత్వాన్ని కోరారు. గుంటూరుకర్నూలుకడపనెల్లూరుమదనపల్లె తదితర  స్థానాల నుంచి అభ్యర్థిత్వం కోరుతూ వచ్చిన బయో డేటాల్లో పలువురు ముస్లింలు ఉన్నారు. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు అమలు చేస్తామని జనసేన విజన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పిన పవన్ కల్యాణ్ పై తమకు ఉన్న విశ్వాసమే అభ్యర్థిత్వాన్ని కోరేలా చేసిందన్నారు. అలాగే కార్గిల్ యుద్దంలో పాల్గొన్న సైనికుడుదళిత నాయకుడు దాసి వెంకట్రావు ఈరోజు స్క్రీనింగ్ కమిటీకి బయో డేటా అందచేశారు. దేశ సరిహద్దుల్లో కొన్ని సంవత్సరాలు పాటు సేవలందించిన వెంకట్రావు అంతకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.

మైనార్టీలు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here