అక్రమకట్టడాలైతే ప్రజావేదికతోపాటు అన్నీ కూల్చేయాలి

0
1436

జనసేన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు:

  • అక్రమకట్టడాలైతే ప్రజావేదికతోపాటు అన్నీ కూల్చేయాలని జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు అన్నారు.

అక్రమకట్టడాలైతే ప్రజావేదికతోపాటు అన్నీ కూల్చేయాలి

  • జనసేన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన .. పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే నేతలు పార్టీలు మారుతున్నారు. జనసేన నుంచి ఎవరూ వెళ్లడం లేదు. ఫిరాయింపులకు నేను వ్యతిరేకం.
  • మా పార్టీలోకి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తాం, జమిలి ఎన్నికలు వస్తే స్వాగతిస్తాం.
  • హోదా సాధనపై ఏపీ ప్రజల్లో తపన కనిపించడం లేదు.
  • ఓడిన తర్వాత కూడా జనం ఆపి తమ సమస్యలు చెప్పడం చూస్తే నాపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో అర్ధమైంది.
  • జనం అజెండా ఏంటో వారు ఏం కోరుకుంటున్నారో వచ్చే కొన్ని నెలల్లో ప్రజాఅజెండా ఖరారు చేస్తాం.
  • రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతా.
  • వైసీపీ విధానాలు తెలిశాకే స్పందిస్తా.
  • ఏడాది తర్వాత ప్రభుత్వంలో తప్పులను ప్రశ్నిస్తాం. టీడీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్టే వైసీపీ ప్రభుత్వానికీ ఇస్తాం.
  • ఏపీ ఆస్తులు తెలంగాణకు ఎలా ఇచ్చారు?. వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here