పాలకొండలో  జనసేనాని ప్రసంగం

0
975

ప్రతి మీతో కలిసి ఇక్కడ రైతుల వద్దకు, అడవి బిడ్డల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోటానికి, వారి సమస్యలను అధ్యయనం చేయటానికి మీలో ఒకడిగా వచ్చాను.

పాలకొండలో జనసేనాని ప్రసంగం :

* తెలుగుదేశం పార్టీలా కాకుండా మన పార్టీ ప్రతీ జనసైనికుడు కూడా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను, సమస్యలను తెలుసుకోండి

* 4దశాబ్దాల అనుభవం ఉంది అంటే సరిపోదు, మీరు ఈ 4 దశాబ్దాలుగా ప్రజలకు ఏం చేయగలిగారు, పాలకొండ ప్రజల కష్టాలు తీర్చటానికి ఏం చేశారు, ఒక్క ఇసుక మాఫియాలు, దోపిడీలు చేయటానికే అయితే ఆ అనుభవం అవసరం లేద ముఖ్యమంత్రి గారు.

* తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏమిటంటే ఈ 4 ఏళ్లలో ఇసుక మాఫియాలు, భూ కబ్జాలు, మహిళలపై దౌర్జనాలు మాత్రమే.

* తెలుగుదేశం అంటే తెలుగు ప్రజలు అందరికోసం ఉండాలే కానీ కొంతమంది కోసం ఉండకూడదు.

* ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంది కూడా శ్రీకాకుళం జిల్లా ప్రయోజనాలు వారి స్వలాభానికి తాకట్టు పెట్టారు అందుకే నేను మీ ముందుకు రావలసి వచ్చింది.

* ప్రతి ఒక్క యువతీ యువకులు వోట్ హక్కు నమోదు చేసుకోండి,మీ తల్లిదండ్రుల చేత మన పార్టీ సిద్ధాంతాలు చెప్పి 2019 లో ఒక సరికొత్త ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయండి.

* ప్రధాని గారు మా కష్టాలు చూడండి, మా దారిద్రం, మా వెనుకబాటుతనం చూడండి, మా ఆకాంక్షలు మా వెనుకబాటుతనం పోవాలి అంటే ప్రత్యేక హోదా కావాలి అని తెలియచేస్తున్నాను.

* ఇంటిలో ఆడపడుచుల ఆరోగ్యం సరిగా చూసుకొని, వారికి విద్యావకాశాలు కల్పించి, వారికి గౌరవం కల్పించగలిగితే సమాజం బాగుపడుతుంది, జనసేన మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here