అమ‌రావ‌తిలో వంశ‌ధార నిర్వాసితుల‌తో జ‌న‌సేనుడి స‌మావేశం.. బాధితుల‌కి ప‌వ‌న్ భ‌రోసా..

0
855

ప‌ది వేల కుటుంబాల్ని రోడ్డున ప‌డేసి, ప‌దేళ్లు గ‌డ‌చినా ప్రాజెక్టు ప‌నులు ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోయారో చెప్పాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.. వంశ‌ధార భూ నిర్వాసితుల్ని క‌లిసి వారి ఇబ్బందులు స్వ‌యంగా తెలుసుకున్న ఆయ‌న‌., వారి ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి చ‌లించిపోయారు…. ప్రాజెక్టు నిర్మాణం కోసం కొత్తూరు, ఎల్ .ఎన్. పేట, హిర‌మండ‌ల్లోని 23 గ్రామాలను ప్ర‌భుత్వం ఖాళీ చేయించింది.

ప్యాకేజిలో భాగంగా 7500 క‌టుంబాల‌కు మెట్టూరు చుట్టుప‌క్క‌ల కాల‌నీలు నిర్మించింది. అయితే ఇక్క‌డ క‌నీస సౌక‌ర్యాలు లేక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. క‌నీస సౌక‌ర్యాలు లేని చోట ఎలా బ‌త‌కాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు క‌నీస ఓటు హ‌క్క కూడా లేకుండా పోయింద‌ని వాపోయారు. ఒక‌ప్పుడు 15 ఎకరాలకు అసాములైన తాము నేడు పునరావాస కేంద్రాల్లో కనీస మౌళిక వసతులు లేక దుర్భ‌ర‌ జీవనం గడపాల్సిన ప‌రిస్థితి నెల‌కొందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. ఇక తాగు నీటి వెత‌లు అయితే వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు..

నిర్వాసితుల ద‌య‌నీయ స్థితి చూశాక గుండెలు పిండేసిన‌ట్ట‌య్యింద‌ని జ‌న‌సేనాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. ఒక్క చూరు కింద నివ‌సించే కుటుంబాలు కూడా చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రుగా విడిపోవాల్సి వ‌చ్చింద‌న్నారు.. మోట్టూరులో ఉన్న నిర్వాసితుల‌ది ఒక్కొక్క‌రిదీ ఒక్కో క‌న్నీటిగాధ అని ఆయ‌న తెలిపారు.. పున‌రావాస ప్యాకేజీ విష‌యంలో కూడా నిర్వాసితుల‌కి తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని జ‌న‌సేన అధినేత మండిప‌డ్డారు.. ప్యాకేజీలు అస‌లు ల‌బ్దిదారుల‌కి చేర‌డం లేద‌ని, నిర్వాసితుల ప్యాకేజీల‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేత‌లు జేబులు నింపుకుంటున్నార‌ని ఆరోపించారు.. ఇంత కంటే దార‌ణ‌మైన ప‌రిస్థితులు ఎక్క‌డా వుండ‌వ‌న్నారు.. ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కు అయినా త‌మ గ్రామాల్లో తాము ఉంటామ‌ని బ‌తిమాలినా, అధికారులు ఒప్పుకోలేద‌న్నారు.. వంశ‌ధార నిర్వాసితుల వెత‌లు ప్ర‌భుత్వానికి, ప్ర‌పంచానికీ తెలిసేలా, అమ‌రావ‌తిలో స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని హామీ ఇచ్చారు.. వంశ‌ధార నిర్వాసితుల‌కి న్యాయం జ‌రిగే వ‌ర‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని ప‌వ‌న్ భ‌రోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here