భారత్ సర్జికల్ స్ట్రైక్ 2

0
1164

భారత సర్జికల్ స్ట్రైక్ 2:

bharath

పుల్వామాదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ అక్రమిత కాశ్మీర్ అడ్డాగా కొనసాగుతున్న క్యాంపులపై భారత సైన్యం విరుచుకు పడింది.అర్థరాత్రి ఇండియానార్మ్య్ సర్జికల్ స్ట్రైక్ పార్ట్ 2 ను ప్రారంభించింది.

తెల్లవారు జామున 3.30 ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిరాజ్ ఫైటర్స్ పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి జైషే ఉగ్రవాదుల శిబిరాన్ని పూర్తిగా ద్వాంసం చేసాయి.

భారత వైమానిక దాడులలో 200 నుంచి 300 వరకు ఉగ్రవాదులు హతం అయినట్టు తెలుస్తుంది .
1000 కేజీల బరువున్న బాంబులను ఉగ్రవాదుల శిబిరాల మీద వేశారు.మొత్తం 1200 మిరాజ్ యుద్ధ విమానాలు LOC (లైన్ అఫ్ కంట్రోల్ ) దాటినట్టుగా పాకిస్థాన్ ప్రకటన.
పుల్వామా దాడికి ప్రతీకారంగా లెక్కకు లెక్క అప్పచెప్తాము అని ప్రధానమంత్రి మోడీ చెప్పినట్టుగానే భారత సైన్యం ఉగ్రవాదుల శిబిరాలపై సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది . పాక్ అక్రమిత కాశ్మీర్ పరిధిలో బాలకోట్ లో వున్న ఉగ్రవాదులను ఎరువేసేలక్షంలా వైమానిక దాడులకు దిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ . పుల్వామా దాడులకు పాల్పడిన జైషే మొహమ్మద్ అతి పెద్ద టెర్రర్ క్యాంపు పూర్తిగా ద్వాంసం అయింది.

పుల్వామా ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ కు బుద్ది చెప్పేందుకు దశాబ్దాల తర్వాత తొలిసారిగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాలలపై దాడులకు పాల్పడింది .
1990 లో వాజ్పాయి హైయ్యాంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు LOC ని
దాటి వెళ్లి దాడులకు పాల్పడ్డాయి.మళ్లీ ఇంతకాలం తర్వాత POK లో వైమానిక దాడులు జరిగాయి.పాక్ పై ప్రతీకార దాడులు తప్పవని కొన్ని రోజులు గా హెచ్చరిస్తున్న ప్రధాన మంత్రి మోడీ ఉగ్రవాదుల క్యాంపు పై విరుచుకు పడాలని రాత్రి సైన్యానికి ఆదేశాలు జారీ చేసారు . మోడీ నుంచి ఆదేశాలు అందుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచమంతా నిద్రపోతున్న సమయంలో పకడ్భందిగా ఆపరేషన్ను పూర్తి చేసింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here